-

వీధి దీపాల కార్యాలయానికి తాళం

17 Aug, 2016 01:36 IST|Sakshi
వీధి దీపాల కార్యాలయానికి తాళం
కోదాడ: ఆరు నెలలుగా తమ వార్డుల్లో   అభివృద్ధి కార్యక్రమాలు అటుంచి కనీసం వీధి ధీపాలు కూడ వేయలేని దుర్భర పరిస్ధితిలో కోదాడ మున్సిపల్‌ కార్యాలయం ఉందన్నారు. అలాంటప్పుడు వీధి ధీపాల విభాగం ఎందుకని ప్రశ్నిస్తూ మంగళవారం పలువురు కౌన్సిలర్లు  మున్సిపాలిటీలో ఉన్న వీధి ధీపాల విభాగానికి తాళం వేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధుల్లో లైట్లు వేయించలేని కౌన్సిలర్‌ పదవి తమకు ఎందుకని, వార్డుల్లో ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చేప్పలేక పోతున్నామన్నారు. తమకు అనుకూలమైన కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రం లైట్లు వేస్తూ ప్రతిపక్షాల వారిని వేధిస్తున్నారని వారు ఆరోపించారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడ దోమల మందు పిచికారి చెయ్యలేదన్నారు. దాని వల్ల పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. మురుగుకాలువలను కూడ శుభ్రం చెయ్యని దుస్ధితి నెలకొందన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ ఏఈ సత్యారావు వచ్చి కౌన్సిలర్లతో మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కొనుగోలు చేసిన లైట్ల వివరాలను తమకు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తుమ్మలపల్లి భాస్కర్, దండాల వీరభద్రం, ఎస్‌కె. షఫి, కుడుముల లక్ష్మీనారాయణ, నాయకులు ముడెం సైదిబాబు, ఉప్పగండ్ల శ్రీనివాస్, కమదం చందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు