సామాజిక రుగ్మతలపై పోరాడాలి

31 Jul, 2016 00:05 IST|Sakshi
సామాజిక రుగ్మతలపై పోరాడాలి
  • రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డి
  • ఘనంగా జిల్లా ‘లయన్స్‌’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
  • కాజీపేట : సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను రూపుమాపేందుకు లయన్స్‌క్లబ్‌ సభ్యులు పాటుపడాలని పట్నా హైకోర్టు రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ లింగాల నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన జిల్లా లయన్స్‌క్లబ్‌ (320 ఎఫ్‌) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం రాత్రి హన్మకొండ కేయూ రోడ్డులోని పీజీఆర్‌ గార్డెన్స్‌లో జరిగింది. ఈ సంద ర్భంగా లయన్స్‌క్లబ్‌ నూతన గవర్నర్‌గా కేయూ మాజీ వీసీ వంగాల గోపాల్‌రెడ్డితో పాటు ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.సునీల్‌కుమార్, వైస్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌–1గా పి.సంపత్‌రెడ్డి, వైస్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌–2గా కే.సీ.జాన్‌బన్నీ, డిస్ట్రిక్ట్‌ కేబినెట్‌ సెక్రటరీగా డాక్టర్‌ పి.సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా జిల్లా పురుషోత్తం తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ సమాజసేవ చేయాలన్న గొప్ప ఆశయంతో లయన్స్‌క్లబ్‌ సభ్యులు పోటీ పడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్‌ ప్రత్యేక లయన్‌ డిస్ట్రిక్ట్‌గా ఆవిర్భవించిందని.. ఈ మేరకు క్లబ్‌ పేరును అంతర్జాతీయస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆయన  ప్రభుత్వ పాఠశాలల కోసం రూ.6లక్షల విలువైన 300 డెస్కులు పంపిణీæచేశారు. అలాగే, తిరుమలాయపాలెం పాఠశాల అభివృద్ధికి రూ.50వేల చెక్కు అందజేశారు. ఈ మేరకు లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ మహబూబాబాద్‌ ఆధ్వర్యంలో కురవి వీరభద్ర లయన్స్‌క్లబ్, వరంగల్‌ ఆపద్బంధు లయన్స్‌క్ల బ్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ డైమండ్స్‌ క్లబ్‌ను నూతనం గా ప్రారంభించి లోగోలు ఆవిష్కరించగా, ఆచార్య కె.రమణయ్య సంపాదకత్వంలో రూపొందించిన డైరీ, నూతన వెబ్‌సైట్‌ను జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. అలాగే తొలితరం లయన్స్‌ సభ్యు లు దేవులపల్లి దామోదర్‌రావు, పి.నారాయణరావు ను సత్కరించారు. ఆహ్వాన సంఘం చైర్మన్‌గా ఎన్‌.రాజిరెడ్డి స్వాగతం పలకగా పొట్లపల్లి శ్రీనివాసరావు, భూపతి మాస్టర్‌ ఆఫ్‌ సెర్మనీగా వ్యవహరించారు. తా డూరి రేణుక శిష్య బృందం శాస్త్రీయ జానపద నృత్యాలను ప్రదర్శించారు. కె.గోవిందరాజు, పోకల చంద ర్, డాక్టర్‌ కె.రాజేందర్‌రెడ్డి, దీపక్‌భట్టాచార్జ్, సురేష్, జావెద్‌ అలీ, విజయ్‌కుమార్‌శెట్టి, ప్రమోద్‌కుమార్, బీ.ఎన్‌.రెడ్డి, డాక్టర్‌ కె.సుధాకర్‌రెడ్డి, డాక్టర్‌ లవకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
    వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు
    సామాజిక సేవలో ముందు నిలుస్తున్న వరంగల్‌ ల యన్స్‌క్లబ్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో విశేష గుర్తింపు లభించినట్లయిందని క్లబ్‌ జిల్లా గవర్నర్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఆదిలాబాద్, కరీం నగర్, సికింద్రాబాద్, హైదరాబాద్‌తో కలిపి వరంగల్‌ లయన్స్‌క్లబ్‌ జిల్లాగా కొనసాగుతుండగా.. 1800 మంది సభ్యులు దాటిన నేపథ్యంలో ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. ఈమేరకు తొలి గవర్నర్‌గా గోపాల్‌రెడ్డి, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 
>
మరిన్ని వార్తలు