ఐఎన్‌టీయూసీకి బలమైన్‌ కేడర్‌

19 Aug, 2016 00:22 IST|Sakshi
మాట్లాడుతున్న త్యాగరాజన్‌
  • రాష్ట్ర కార్యదర్శి సి త్యాగరాజన్‌
  • మణుగూరు రూరల్‌ : ఐఎన్‌టీయూసీకి బలైమన కేడర్‌ ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి సి త్యాగరాజన్‌ అన్నారు. గురువారం మణుగూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అండదండలతో అనేక పదవులు పొంది నేడు స్వలాభం కోసం యూనియన్‌ వీడుతున్న నాయకుల గురించి కార్యకర్తలు ఆలోచించాల్సిన పనిలేదన్నారు. జాతీయ కార్మిక సంఘమైన ఐఎన్‌టీయూసీకి బలమైన కేడర్‌ ఉందన్నారు. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని కార్మిక సమస్యలపై పోరాడుతామన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కలిసి పోటీచేసే అవకాశాలు ఉన్నాయన్నారు. అవసమైతే కలిసి వచ్చే అన్ని జాతీయ సంఘాలను కలుపుకొని కార్మికుల పక్షాన నిలబడతామన్నారు. సెప్టెంబర్‌ 2న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఐఎన్‌టీయూసీ పూర్తిగా సింగరేణిలో ఉండదని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు.  సీఐటీయూ నేత మంద జగన్నాథం అక్రమ బదిలీనినిలిపి వేయాలని కోరారు. ఆ సంఘం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఎస్‌ సోమరాజు పాల్గొన్నారు
     

మరిన్ని వార్తలు