ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుత్ను విద్యార్థిని పోలీసులకు అప్పగింత

12 Dec, 2016 15:02 IST|Sakshi

చెన్నూరు: విద్యార్థినుల పట్ల నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతున్న చెన్నూరుకు చెందిన ఓ యువకుడ్ని  పోలీసులకు అప్పగించారు. తమను నిత్యం బస్సుల్లో ఈవ్‌టీజింగ్‌ చేస్తున్నారని కొందరు విద్యార్థినులు కడపలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు గమనించి హెచ్చరించినా మార్పు రాలేదు. రోజూలాగే బస్సులో ఈవ్‌టీజింగ్‌ చేస్తున్న యువకులను బుధవారం సాయంత్రం కడప నుంచి పల్లెవెలుగు బస్సులో వెళుతున్న ఆ మహిళా కానిస్టేబుల్‌ గమనించి, చెన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్‌ఐ తమదైన శైలిలో కోటింగ్‌ ఇచ్చారు. చెన్నూరు కొత్తరోడ్డు వద్ద కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నామని, విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు