విద్యార్థుల అభ్యసన తీరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

27 Jul, 2016 01:50 IST|Sakshi
విద్యార్థుల అభ్యసన తీరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

చివ్వెంల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన తీరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దష్టి సారించాలని స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ సభ్యుడు యానాల వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు కుడకుడ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన  కాంప్లెక్స్‌ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుట, రాయుట, బొమ్మల గీసే విధంగా  ప్రాథమిక స్థాయి నుంచే తీర్చిదిద్దాలని కోరారు. ఎస్‌ఎంసీ సభ్యులు, గ్రామస్తుల సహకరంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు పూర్తిగా వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. హరితహరంలో భాగంగా పాఠశాలల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు చింతమళ్ల వెంకటి, బొప్పని శ్రీనివాస్, కటకొండ రామయ్య, చంద్రయ్య, విమల, తదితరుల పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు