ఆటల పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

3 Dec, 2016 03:58 IST|Sakshi
ఆటల పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

కలుజువ్వలపాడు (తర్లుపాడు): ఈ నెల 1న మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఖేల్ ఇండియా పోటీల్లో మండలంలోని కలుజువ్వలపాడు జెడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా స్థారుుకి ఎంపికయ్యారు. అండర్- 17 వంద మీటర్ల విభాగంలో ఎస్‌కే బాజి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం మంగమ్మ, 400 మీటర్లు విభాగంలో ఎం.శాంతి ప్రథమస్థానం, లాంగ్ జంప్‌లో డి.హిమబిందు ప్రథమ స్థానం, అండర్ 14లో టి.వెలుగొండరెడ్డి లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం గెలుపొందారు. జిల్లా స్థారుు కబడ్డీ జట్టుకు యు.వెంకటేశ్వర్లు, ఎ.శివారెడ్డి, టి.వెలుగొండారెడ్డి, టి.మంగమ్మ, ఎం.శాంతిలు ఎంపికై నట్లు ఎంఈఓ సీఎస్ మల్లికార్జున్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.  

ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థారుుకి ఎంపిక   
మార్కాపురం రూరల్: మండలంలోని మిట్టమీదిపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో జిల్లా స్థారుుకి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సరళ శుక్రవారం తెలిపారు. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జరుగుతున్న డివిజన్ స్థారుులో ఖేలో ఆటల పోటీల్లో అండర్-14 లో కబడ్డీలో ఎం.మోనిక, 100 మీటర్స్ రన్నింగ్‌‌సలో  మల్లేశ్వరి, 400 మీటర్స్ రన్నింగ్‌‌సలో  స్వప్న, లాంగ్ జంప్‌లో సౌమ్య, ఖోఖోలో పాలీశ్వరరెడ్డి  ఎంపికై నట్లు వారు తెలిపారు. అండర్ - 17 వాలీబాల్, షాట్‌పుట్‌లో శ్రీను జిల్లా స్థారుులో ఎంపికై ందన్నారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థులు అన్నీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని గెలుపొందటం ఆనందంగా ఉందన్నారు. బహుమతులు గెలుపొందిన విద్యార్థులకు   అభినందనలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు