విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలి

26 Sep, 2016 18:43 IST|Sakshi
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలి

–డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు
అవంతీపురం(మిర్యాలగూడ రూరల్‌):  విద్యార్థులు చదువుకే పరిమితంగా కాకుండా అన్ని రంగాల్లో రాణించేలా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన గురుకుల పాఠశాల జిల్లా పర్యవేక్షణాధికారి నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని అవంతీపురం గిరిజన బాలుర పాఠశాలలో సందర్శంచిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర గురుకుల సెక్రెటరీ ప్రవీణ్‌ కుమార్‌ విద్యార్థులకు ఉత్తమ విద్యాతోపాటు క్రీడలు, పర్వతారోహణ, సివిల్‌ సర్వీస్‌ వంటి వాటికి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి, అందులో రానించే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో నాలుగు గిరజన గురుకుల పాశాలలు ఉండగా అందులో 2,500 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం డిజిటల్‌ తరగతిలు నిర్వహిస్తున్నమని అందుకు కావలసిన పరికరాలు అయా పాఠశాలలకు పంపిణీ అయినట్లు తెలిపారు.  ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు  ఆరు అదనపు   గురుకులాలను మిర్యాలగూడ , మల్లెపల్లి , చివ్వెంల బాలకలకు, దామరచర్ల, దేవరకొండ ,పెద్దవూర లో బాలురకు మంజూరు చేసిందిన్నారు.  జిల్లా నుంచి 10 మంది విద్యార్థులు పర్వతారోహణ  శిక్షణకు ఎంపిపైనట్లు తెలిపారు. విద్యార్థులకు  అక్టోబర్‌  14 నుంచి 16 వరకు ఖమ్మం జిల్లాలో ని గుండాల,సూదిమెట్లలో  జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నూనె కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు