‘కస్తూర్బా’కు చలిజ్వరం

15 Aug, 2016 21:33 IST|Sakshi
విద్యార్థినిని చికిత్స కోసం తీసుకువచ్చిన టీచర్‌
  • కళ్లు తిరిగి పడిపోతున్న విద్యార్థినులు
  • సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స
  • 8 మందికి పైగా జ్వరాలు
  • మునిపల్లి: తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చలి జ్వరం పట్టుకుంది. ఉన్నట్టుండి విద్యార్థినులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. కొందరైతే శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కృష్ణవేణి అనే విద్యార్థినిని శ్వాసతీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. తాటిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్‌ సంగారెడ్డికి తీసుకెళ్లాలని సూచించారు.

    దీంతో ఆ విద్యార్థినిని హుటాహుటిన సంగారెడ్డికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోందని పాఠశాల ప్రిన్సిపాల్‌ కవిత తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థినులు చలి జ్వరంతో బాధ పడుతున్నారు. వారిని కూడా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా ఒకరి తరువాత ఒకరు కళ్లు తిరిగి పడిపోతుండటంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తున్నట్టు వారు తెలిపారు.

మరిన్ని వార్తలు