విద్యార్థులు హాజరు తగ్గితే చర్యలు

1 Aug, 2016 18:19 IST|Sakshi
విద్యార్థులు హాజరు తగ్గితే చర్యలు
ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థుల హాజరు శాతాలు తగ్గితే తగిన చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరం, సోషియాలజీ, సోషల్‌వర్క్‌ విభాగాలను సందర్శించారు. ప్లాటినం జూబ్లీ వసతిగహంలో వంటశాలను వనియోగించడ పోవడం, అపరిశుభ్ర వాతావరణంతో నిండిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిధులకు కేటాయించే గదులను మరింత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వసతులను పెంచాలన్నారు. వెంటనే సంబంధిత డీన్‌ తనను సంప్రదించాలని సిబ్బందికి సూచించారు. 
అనంతరం ఏయూ సోషియాలజీ విభాగాన్ని సందర్శించారు. విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటంపై సంబంధిత విభాగాధిపతితో మాట్లాడారు. తరగతులు ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా తరగతులకు హాజరు కాని విద్యార్థులపై చర్యలు తీసుకోవాలన్నారు. వీరికి నోటీసులు పంపాలని ఆదేశించారు. విభాగాధిపతి ఇప్పటికే ప్రిన్సిపాల్‌ కార్యాలయానికి లేఖ రాసామని తెలిపారు. కొంతమంది విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ తరగతులకు  హాజరుకావడం లేదని విభాగాధిపతి వీసీ దష్టికి తీసుకెళ్లారు. మొదటి సంవత్సరం తరగతితో కేవలం ఒక విద్యార్థి ఉండటాన్ని వీసీ గమనించారు. వర్సిటీలో ప్రతీ విభాగంలో పూర్తిస్తాయిలో విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  
అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరుపట్టికలను పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరుకాకుంటే తగిన చర్యలు తీసుకోవాలని విభాగాధిపతులకు స్పష్టం చేశారు. తరగతుల నిర్వహణ సక్రమంగా జరగాలని, విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
మరిన్ని వార్తలు