విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

7 Mar, 2017 00:36 IST|Sakshi
జేఎన్టీయూ : విద్యార్థులు స్వయం కృషితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జేఎ¯ŒSటీయూ ప్రిన్సిపాల్‌ ఆచార్య ప్రహ్లాదరావు సూచిం చారు. జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని మెకానికల్‌ విభాగంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ సెంట ర్, హైదరాబాద్‌’ వారి ఆధ్వర్యంలో మూడురోజులపాటు విద్యార్థులకు ఔత్సాహిక పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించారు. సోమవారం కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సృజనాత్మకతతో మంచి ప్రాజెక్టులను తయారు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సదస్సు కో–ఆరి్డనేటర్‌ డాక్టర్‌ కళ్యాణి రాధ, డాక్టర్‌ పీవీ రామరాయలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు