విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

16 Jul, 2016 19:12 IST|Sakshi
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

మహేశ్వరం ‘కస్తూర్బా’లో ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
 మొక్కలు నాటిన ఈఎస్‌ఐ జాయిoట్ డెరైక్టర్ పద్మజ


మహేశ్వరం: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈఎస్‌ఐ జాయిoట్ డెరైక్టర్ కల్వకుంట్ల పద్మజ పేర్కొన్నారు. చదువుతో పాటు ఆరోగ్య భద్రత ముఖ్యమని ఆమె విద్యార్థులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్య ఉంటుందని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రావాన్నారు.

అంతకు ముందు విద్యార్థులకు కంటి పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ, షుగర్, జనరరల్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. మహేశ్వరంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని పద్మజకు గ్రామ సర్పంచ్ ఆనందం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పెంటమల్ల స్నేహ, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, ఎంపీడీఓ నీరజ, ఎంఈఓ కృష్ణ, ఎస్‌ఐ సారుుప్రకాష్, ఉప సర్పంచ్ రాములు, ఎంపీటీసీ బుజ్జిబద్రునాయక్, కాంగ్రెస్ నాయకులు నవీన్, ఈఎస్‌ఐ అధికారి రవీందర్‌గుప్తా, ప్రగతి యువజన సంఘం అధ్యక్షుడు రాఘవేందర్ , వైద్యులు మల్లిక, శరత్ ఉన్నారు.   
 

మరిన్ని వార్తలు