సబ్‌ డీఎఫ్‌ఓ ఆఫీసే జిల్లా కార్యాలయం

5 Sep, 2016 00:12 IST|Sakshi
మహబూబాబాద్‌ : మానుకోట జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఇక్కడి సబ్‌ డీఎఫ్‌ఓ కార్యాలయాన్నే డీఎఫ్‌ఓ కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధికారులు ఆ భవనాన్ని పరిశీలించి ప్రక్రియ ప్రారంభించారు. అధికారుల బాధ్యతల్లో పలుమార్పులు జరగనున్నాయి. కొన్ని మండలాలు డీఎఫ్‌ఓ పరిధిలో చేరనున్నాయి. అటవీశాఖ మానుకోట సబ్‌డివిజన్‌ పరిధిలో గూడూరు, నెక్కొండ, చెన్నారావుపేటలోని కొన్ని గ్రామాలు మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదురు, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, నర్సింహులపేట, కురవి, కొత్తగూడలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌ఓ పరిధిలో పది మండలాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
 
నూతన డీఎఫ్‌ఓ పరిధిలో నాలుగు రేంజ్‌లు
 
మానుకోట డీఎఫ్‌ఓ పరిధిలోకి నాలుగు రేంజ్‌లు రానున్నాయి. మానుకోట రేంజ్‌తోపాటు బయ్యారం, గూడూరు, కొత్తగూడ రేంజ్‌లు ఉంటాయి. గూడూరు మండలంలోని కొంగరగిద్ద గ్రామం వైల్డ్‌లైఫ్‌ విభాగంలోకి వెళ్తుంది. నెక్కొండ మండలం వరంగల్‌ జిల్లాలోకి వెళ్లినా గూడూరు రేంజ్‌ పరి«ధిలోనే ఉంటుంది. సోషల్‌ ఫారెస్ట్‌ ప్రత్యేక విభాగం టెరిటోరియల్‌ విభాగంలోకి చేర్చుతున్నారు. సబ్‌ డీఎఫ్‌ఓలోనే ఏసీఎఫ్‌ (అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫీసర్‌)గా మారుస్తున్నారు. కొన్ని నోడల్‌ అధికారుల మార్పు కూడా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని మార్పులు మాత్రం ప్రత్యేకంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 
మరిన్ని వార్తలు