దళితబాట సరే..సబ్‌ప్లాన్‌ ఊసేదిబాబూ

28 Oct, 2016 00:02 IST|Sakshi
  • జిల్లాలో సబ్‌ప్లాన్‌  పనుల్లో తీవ్ర జాప్యం
  • పాలకుల నిర్లక్ష్యమే కారణమంటున్న
  • దళిత నాయకులు సబ్‌ప్లాన్‌ కే దిక్కులేదు..
  • దళిత బాట దేనికంటూ ఎద్దేవా..!
  • సమీక్షలు, సమావేశాలు పెట్టని కమిటీలు దేనికంటూ దళితుల ప్రశ్న?
  •  
    భానుగుడి (కాకినాడ) :
    ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నాయని జిల్లాలో ఎస్సీ,ఎస్టీల ప్రగతిని గమనిస్తే తెలుస్తోంది. దళితుల సామాజిక స్థితిగతులను మార్చే దిశగా ఉన్నత లక్ష్యంతో 2013లో ప్రవేశ«పెట్టిన సబ్‌ప్లాన్‌  నిధులు సైతం తాజాగా ఆ కోవలోకి చేరాయి. శాఖల వారీగా కేటాయింపులు జరిగినా పనుల నిర్వహణ ’ఎక్కడి గొంగళి అక్కడే’ అన్న చందంగా చతికిలపడింది. అధికారుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక బృహత్తర ప్రణాళిక పేద ప్రజలకు చేరడం లేదు. లోపాలను సరిదిద్దకుండా దళితబాట కార్యక్రమాలేమిటని దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు ప్రశ్నిస్తున్నారు.
    ఇదీ సబ్‌ప్లాన్‌ .
    దళితులకోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను దామాషా ప్రాతిపదికన వారి ప్రగతికే ఖర్చు చేయాలన్న నిబంధనతో ప్రత్యేక అభివృద్థి కమిటీల ఏర్పాటుతో 2013లో ఈ సబ్‌ప్లాన్‌  రూపుదిద్దుకుంది. రాష్ట్ర  బడ్జెట్‌లో ఎస్‌సీల ప్రగతికి 17.01 శాతం, ఎస్‌టీలకు 5.53 శాతం నిధులను కేటాయిస్తున్నారు. ఈ నిధులను సబ్‌ప్లా¯ŒSలో భాగంగా మంత్రులు, ప్రిన్సిపల్‌ కార్యదర్శి, శాఖల ముఖ్య అధికారులు సభ్యులుగా ఉన్న నోడల్‌ ఏజెన్సీలు, హైలెవల్‌ వర్కింగ్‌ కమిటీ, రాష్ట్ర కౌన్సిల్‌లు శాఖల వారీగా ప్రత్యేక ప్రణాళికల ఆధారంగా కేటాయిస్తారు. సబ్‌ప్లాన్‌  యాక్ట్‌ ప్రకారం ఈ కమిటీలు ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించి ప్రగతిపై చర్చ జరపాలి. తొలినాళ్ళలో సమావేశం నిర్వహించి తర్వాత చేతులు దులుపుకున్నారు. ఇప్పటికి ఒకే ఒక్కసారి మినహా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేకపోవడం దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుధ్ధి అవగతం అవుతోంది.
    జిల్లాలో పరిస్థితి ఇదీ..!
    ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం భారీ బడ్జెట్లు ప్రవేశపెట్టి అరకొర నిధులు వెదజల్లి అయిందనిపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 2016–17 సంవత్సరానికిగాను రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌  నిధుల రూపంలో రూ.8856 కోట్లు ఎస్‌సీల అభివృధ్దికి, 3099 కోట్లు ఎస్‌టీల అభివృధ్దికి  కేటాయించారు.  కేటాయింపులు జరిగాయి గానీ శాఖల వారీగా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకులకు చిత్తశుద్ధి లేమి కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని దళితులు వాపోతున్నారు. 
    రహదారుల సంగతేంటి?
    దళితులు 40 శాతంకంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్‌శాఖలో 140 పనులను గుర్తించారు. వీటికి జిల్లాలో రూ.40 కోట్లు కేటాయించారు. ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ కింద 19 పనులు గుర్తించగా 19.26 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లోనూ ఎటువంటి పురోగతీ లేదు.  
    స్త్రీనిధి.. టీడీపీ వారికి మాత్రమే..!
    గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళిత మహిళల ప్రగతికి స్త్రీనిధిని ప్రభుత్వం అందిస్తోంది. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకుల కారణంగా అసలైన లబ్థిదారులకు ఈ నిధులు అందడం లేదు. దీనికి సబ్‌ప్లా¯ŒS నిధుల రూపంలో రూ.14 కోట్లు విడుదలయ్యాయి. 31 మండలాల్లో 3622 మంది మహిళలకు రూ.14కోట్లు మంజూరు చేశారు. వీటిని సగం మందికి కూడా ఇంకా అందివ్వ లేదు. టీడీపీలోని పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఈ ఫలాలు అందుతున్నాయని, సామాన్యులకు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    ప్రచారం లోటు..
    సబ్‌ప్లాన్‌  నిధుల్లో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్, సివిల్స్‌ కోచింగ్‌ నిమిత్తం జిల్లాకు వెయ్యి సీట్లు కేటాయించగా ఇందులో ఎస్‌సీలకు 700, ఎస్‌టీలకు 300. దీనికి నెలకు ప్రతి విద్యార్థికి 8 వేలు ఉపకారవేతనం అందిస్తారు. జిల్లాలో ఈ పథకం ప్రచార లేమి కారణంగా కేవలం 24 మంది ఎస్‌సీ విద్యార్థులు,  ఏడుగురు ఎస్‌టీ విద్యార్థులు మాత్రమే ఎంపికవడం విచారకరం.
    ఎస్సీ రుణాల గ్రౌండింగ్‌ ఎప్పటికి పూర్తయ్యేనో....
    షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రభుత్వ ప్రకటనలు ప్రచార ఆర్భాటానికే తప్ప క్షేత్ర స్థాయిలో చంద్రన్న సంక్షేమం కానరావడం లేదు. షెడ్యూల్డ్‌ కులాలకు ఎస్సీ కార్పొరేషన్‌  ద్వారా అందించే రుణాల ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. 2015–16 ఆర్థిక సంవత్సర లబ్థిదారుల రుణాల గ్రౌండింగ్‌ నేటికీ వందల సంఖ్యలోనే ఉంది. సబ్సిడీ రుణం మంజూరు చేసినప్పటికీ వాటికోసం సంవత్సర కాలంగా లబ్థిదారులు ఎస్సీ కార్పొరేషన్, బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా ఫలితం లేని దుస్థితి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016–17)కు అర్ధ సంవత్సరం దాటినా లబ్థిదారుల నుంచి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణలోనే ఉన్నారు. 
    జిల్లాలో 2015–16 సంవత్సరానికి రూపొందించిన రుణ ప్రణాళిక ప్రకారం స్వయం ఉపాధి పథకాలకు ఆర్ధిక సహాయం అమలు చేసేందుకు రూ.112.11 కోట్లతో  8,473 మందికి లబ్థి చేకూర్చేందుకు లక్ష్యాన్ని నిరే్ధశించారు. దీనిలో బ్యాంక్‌ లింకేజీ పరంగా 2,594 మంది లబ్థిదారులకు రూ.3644.86 లక్షలు మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు. కాని కేవలం 127 మంది లబ్థిదారులకే ఇప్పటి వరకు రుణాల గ్రౌండింగ్‌ పూర్తయింది. అలాగే బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందజేసే ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ స్కీంలో రూ.566.14 లక్షలతో 316 మంది లబ్థిదారులకుగాను రూ.198.25 లక్ష్యలతో 90 మందికి, ఎన్‌ఎస్‌కెఎఫ్‌డీసీ స్కీంలో రూ.166.35 లక్షలతో 109 మందికిగాను రూ.29.50 లక్షలతో 90 మందికి రుణ మంజూరు అయితే చేశారు కానీ నేటికీ ఒక్క పైసాకూడా లబ్థిదారులకు ఇవ్వలేదు.
     
    సబ్‌ప్లాన్‌  ఊసేదీ : సబ్‌ ప్లాన్‌ కమిటీ సభ్యులు రెండు నెలలకోసారి సమావేశం కావాలి. 2013లో ఈ కమిటీ ఏర్పడింది. ఆదిలో ఓసారి సమావేశమయ్యారు. తరువాత ఆ ఊసే లేదు.
     
    నిధులు సరే, అమలేదీ : 2016–17 సంవత్సరానికిగాను రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌  నిధులు రూ.8,856 కోట్లు ఎస్సీల అభివృద్ధికి, రూ.3,099 కోట్లు ఎస్టీల అభివృద్ధికి  కేటాయించారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఎస్‌సీ, ఎస్‌టీలున్నా ఈ నిధుల వ్యయం అంతంతమాత్రమే.
     
    అతీగతీలేని భవనాలు : మంజూరైన 76 సామాజిక భవనాల్లో 56 మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో 30కి పైగా వివిధ దశల్లో నిలిచి
    పోయాయి.
     
    రహదారుల సంగతేంటి? : గిరిజన ప్రాంతాల్లో 19 రహదారి పనులను సబ్‌ ప్లా¯ŒS కింద గుర్తించి రూ.19.26 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లోనూ ఎటువంటి పురోగతీ లేదు.
     
    శ్మశాన వాటికల మాటేమిటి!
    సబ్‌ప్లాన్‌ లో భాగంగా జీవో నంబరు 715,1235 ప్రకారం జిల్లాలో దళితులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో వీటికోసం ప్రత్యేకంగా దరఖాస్తులు సమర్పించినా ఎటువంటి పరిష్కారమూ చూపించలేదు.
     
    అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి
    అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి కింద విదేశాల్లో పీజీ చదివే విద్యార్థులకు రూ.15 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఏడాది 500 మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నా ఈ ఏడాది కేవలం ఏడుగురు మాత్రమే విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్ళారంటే ఈ పథకం తీరు అర్ధం చేసుకోవచ్చు.
     
    అతిగతీలేని సామాజిక భవనాలు...
    సబ్‌ప్లాన్‌  నిధుల కింద ఈ ఏడాది 76 సామాజిక భవనాలు జిల్లాకు మంజూరయ్యాయి. ఇందులో 56 భవనాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో వివిధ దశల్లో నిలిచిపోయిన భవనాలు 30కి పైగా ఉన్నాయి. ప్రారంభమై ఏళ్ళు గడుస్తున్నా అర్థంతరంగానే ఉన్నాయి . వీటికోసం వెచ్చించిన రూ.5 కోట్ల 70 లక్షల సబ్‌ప్లాన్‌  నిధులు కేవలం ఫౌండేషన్లకే పరిమితమయ్యాయి.
     
    50 యూనిట్ల ఉచితం విషయం తెలియదు
    దళితులకు 50 యూనిట్లులోపు కరెంటు ఉన్న ఇళ్ళకు ఏపీఈపీడీసీఎల్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తుంది.ఈ వెసులుబాటు ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు. దీంతో ఎవరూ దీన్ని వినియోగించుకోవడం లేదు. 
    – ఐ.సుభాష్, దళిత సామాజిక కార్యకర్త
     
    ప్రతి పాదనలు పంపించాం
    దళిత గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కోసం రూ.53 కోట్లు ప్రతిపాదనలు జిల్లాలో సిద్ధం చేశారు. వీటిని నోడల్‌ ఏజేన్సీకి పంపారు. ఆర్‌అండ్‌బి ద్వారా జిల్లాలో రూ.92 కోట్లు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ఎక్కువగా ట్రైబల్‌ ఏరియాలో రహదారుల పనులే ఎక్కువ. ఈ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాం.
    – ఎన్‌  స్టాలిన్‌ బాబు, జిల్లా మానిటరింగ్‌ నాన్‌  అఫీషియల్‌ కమిటీ సభ్యులు
     
మరిన్ని వార్తలు