సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

28 Aug, 2016 18:48 IST|Sakshi
రాస్తారోకో నిర్వహిస్తున్న ఇప్టూ నాయకులు
మక్తల్‌ : కార్మికుల హక్కుల రక్షణకు సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా సహాయకార్యదర్శి కిరణ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సమావేశాలు, బైక్‌ర్యాలీతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని అన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఐబీ నుంచి నెహ్రూగంజ్, సంగంబండ, నల్లజానమ్మగుడి, పాతబజార్‌ మీదుగా అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు భుట్టో, శ్రీనివాసులు, రమేష్, రాము, గోపి, రాజు, వెంకటేష్, సజన్, మారెప్ప, దేవప్ప, తదితరులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు