సూఫీతత్వం మతసామరస్యానికి పునాది

16 Oct, 2016 20:56 IST|Sakshi
రాజమహేంద్రవరం కల్చరల్‌ :
సూఫీతత్వం మత సామరస్యానికి పునాది, ప్రతీక అని విశ్వవిజ్ఞాన విద్యాపీఠం నవమ పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌అలీషా అన్నారు. జనభావన సాంస్కృతిక సంస్థ, పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గౌతమఘాట్‌లోని పీఠంలో ఆయన ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ రచించిన ‘సూఫీ–ఖురాన్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉమర్‌ అలీషా మాట్లాడుతూ వేదవాజ్ఞ్మయంలో, సూఫీలో చెప్పింది ఒకటేనన్నారు. గ్రంథ సమీక్ష చేసిన ముస్తాఖ్‌ అహ్మద్‌ అభిషేక్‌ మాట్లాడుతూ అశాంతి, అనైతిక జీవనం, మత సంఘర్షణలు ఆధునిక సమాజాన్ని నకరప్రాయం చేస్తున్నాయన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం సూఫీతత్వంలో లభిస్తుందన్నారు. అమలాపురానికి చెందిన సంగీత, సాహిత్యభూషణ రేకపల్లి శ్రీనివాసమూర్తి, పద్యకళా తపస్వి డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి, గ్రంథకర్త చింతలపాటి శర్మ మాట్లాడారు. డాక్టర్‌ దాయన వెంకట సురేష్‌ చంద్రజీ సభాసంచాలకునిగా వ్యవహరించారు. గ్రంథ  స్వీకర్త మహ్మద్‌ ఖాదర్‌ ఖాన్‌ గ్రంథకర్త చింతలపాటి శర్మ కృషిని కొనియాడారు. ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎస్పీ గంగరెడ్డి, నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు