బైకు ఇవ్వలేదని ఆత్మహత్య

10 Jun, 2017 00:20 IST|Sakshi
పడమరప్రాతకోట(పగిడ్యాల): తనకు బైకును తీసుకుంటుంటే తండ్రి అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన పెద్దమాసుం కుమారుడు ముర్తూజావలి(23) గౌండా పని చేసేవాడు. రెండేళ్ల క్రితమే అబ్దుల్లాపురానికి చెందిన  మౌలాబితో పెళ్లి జరిగింది. తర్వాత మద్యానికి బానిసగా మారిన ముర్తూజావలి నెల క్రితమే కొత్తగా బైక్‌ కొన్నాడు. మద్యం మత్తులో ఎక్కడపడితే అక్కడ కిందపడి ప్రమాదాలకు గురవుతుంటే బైక్‌ తీసుకెళ్లకుండా తండ్రి అడ్డుకునేవాడు. విషయంపై శుక్రవారం తండ్రి కొడుకు మద్య వాగ్వాదం జరిగింది. బైక్‌ ఇవ్వకపోతే చనిపోతానంటూ ముర్తూజావలి బెదిరించాడు. వెంటనే నందికొట్కూరు వెళ్లి పురుగు మందు తెచ్చుకుని తాగేశాడు. కుటుంబ సభ్యులుకర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటికే మరణించాడు. భార్య మౌలాబి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలనరసింహులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు