రాఖీ పండుగకు పంపలేదని ఆత్మహత్య

19 Aug, 2016 00:20 IST|Sakshi
  • కిరోసిన్‌ పోసుకున్న వివాహిత 
  • చికిత్స పొందుతూ ఎంజీఎంలో మృతి 
  • మడికొండ : రాఖీ పండుగకు తల్లిగారింటికి పంపించలేదని వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని మృతి చెందిన ఘటన వరంగల్‌ 33వ డివిజన్‌లోని కుమ్మారిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దామెరుప్పుల స్వప్న(22) రాఖీ పండుగకు తన పుట్టిల్లయిన దుగ్గొండి మండలం దేశాయిపేటకు వెళ్తానని భర్త రవీందర్‌ను అడిగింది. అయితే తన నలుగురు అక్కలు కూడా రాఖీ కట్టేందుకు వస్తారని, వారు వచ్చాక వెళ్దామని రవీందర్‌ స్వప్నతో చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన స్వప్నం బుధవారం మధ్యాహ్నం భర్త పడుకున్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె అరుపులతో లేచిన రవీందర్‌ మంటలను అర్పి చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై విజ్ఞాన్‌రావు తెలిపారు. వీరి వివాహం రెండేళ్ల క్రితం జరుగగా, ప్రస్తుతం ఏడు నెలల బాబు ఉన్నాడు. అయితే స్వప్న వివాహ సమయంలో ఆమె తండ్రి కందికొండ రాజ్‌కుమార్‌ రెండెకరాల భూమితో పాటు రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా  పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు స్థానికులు చెప్పారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.  
>
మరిన్ని వార్తలు