అద్దె భవనం కావాలి

17 May, 2017 01:24 IST|Sakshi
అద్దె భవనం కావాలి

మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు దొరకని అనువైన భవనాలు
నెలల తరబడి జల్లెడ పడుతున్న అధికారులు
స్కూళ్ల ప్రారంభానికి దగ్గర పడుతున్న సమయం


ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌) : జిల్లాకు 12 నూతన మైనారిటీ రెసిడెన్షియల్‌ సూళ్లు మంజూరు కాగా వాటికి భవనాలను సమకూర్చడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. భవనాలు అద్దెకు కావాలెను అని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. రెండు, మూడు నెలలుగా అనువైన అద్దె భవనాల కోసం మైనారిటీ సంక్షేమ అధికారులు జిల్లా మొత్తం చక్కర్లు కొట్టి జల్లెడ పడుతున్నారు. కేవలం నాలుగైదు స్కూ ళ్లకు మాత్రమే అనువైన అద్దె భవనాలు దొరికాయి. అగ్రీమెంట్‌ కూడా చేసుకున్నారు. మిగిలిన వాటికి అద్దె భవనాలు దొరక్క అధికారులు నానా తంటాలు పడుతుంటే.. మరికొన్నింటికి దొరికినట్లే దొరికి చేజారుతున్నాయి.

అద్దె భవనాల యజమానులు మళ్లీ వెనక్కి తీసుకుం టున్నారు. జిల్లాకు నూతనంగా 12 మై నారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను 2017 జనవరి 27న జీఓ. నెంబర్‌ 4 ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. నిజామాబాద్‌ ప్రాంతానికి మూడు బాలికల స్కూళ్లు, మూడు బా లుర స్కూళ్లు ఉం డగా డిచ్‌పల్లి బాలుర 1, బోధన్‌ బాలి కల 1, ఆర్మూర్‌ బాలి కల 1, రెంజల్‌ బాలికల 1, బాల్కొండ కు బాలుర 1, బాలికల 1 చొప్పున రెసిడెన్షియల్‌ స్కూ ళ్లు ఉన్నాయి. వీటికి సొంత భవనాలను నిర్మించే వరకు తా త్కాలికంగా అద్దె భవనాలను చూసి అందులో 2017–18 విద్యా సంవత్సరానికి తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాధికారులను ఆదేశించింది. అధికారులు ముం దుగా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల పక్రియను పూర్తి చేశారు. ప్రస్తు తం జూన్‌ 12న స్కూళ్లు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాకు మం జూరు చేసిన 12 స్కూళ్లను కూడా అప్పు డే ప్రారంభించాల్సి ఉంది. బాల, బాలి కలకు స్కూళ్లలోనే విద్యతో పాటు వస తి, భోజనం కల్పించాలి. తరగతుల బోధన, విద్యార్థులకు వసతిని కల్పించాలంటే ఇందుకు పెద్ద భవనాలు అవసరం ఉంటుంది.

కనిపించిన వారికల్లా అద్దె భవనాలు ఉంటే చూడండి అని అధికారులు చెబుతూనే ఉన్నారు. చివరికి పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం నాలుగైదు స్కూళ్లకు మాత్రమే అద్దె భవనాలు దొరికాయి. ఒక్కో భవనానికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.1 లక్ష నుంచి రూ.1 లక్ష 50 వేలకు పైగా చెల్లించడానికి అధికారులు ముందుకు వస్తున్నారు.అయితే సౌకర్యాలున్న పెద్ద పెద్ద భవనాలు దొరకడం కష్టంగా మారింది.

వెతుకుతున్నాం : కిషన్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి
జిల్లాకు మంజూరైన నూతన మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు అనువైన అద్దె భవనాల కోసం వెతుకుతున్నాం. ప్రస్తు తం కొన్ని స్కూళ్లకు భవనాలు దొరికా యి. మరికొన్నింటికి భవనాలు దొరకడం కష్టంగా మారింది. అద్దె భవనాల కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం.

మరిన్ని వార్తలు