‘ఎవరు మీలో కోటీశ్వరుడు?’ సొమ్ము సేవలకే..

5 Aug, 2017 23:38 IST|Sakshi
‘ఎవరు మీలో కోటీశ్వరుడు?’ సొమ్ము సేవలకే..
-టీవీ యాంకర్‌ సుమ, నటుడు రాజీవ్‌ కనకాల
యానాం : సేవా దృకృథంతో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు టీవీ యాంకర్‌ కనకాల సుమ పేర్కొన్నారు.శనివారం స్ధానిక కనకాలపేట ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.60 వేల విలువచేసే ప్రొజెక్టర్, స్క్రీన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరో, తనభర్త రాజీవ్‌ కనకాల, తాను కలిసి మాటీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన సొమ్ముతో వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగానే పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే ప్రొజెక్టర్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కనకాల రాజీవ్‌ మాట్లాడుతూ తన స్వగ్రామంలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు  చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, రాజమండ్రి తదితర చోట్ల ప్రొజెక్టర్లు ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కేఎన్‌ లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణరావు, సూర్యప్రకాష్, నళినీకుమారి,మహ్మద్‌ యాకూబ్‌ తదితరులు పాల్గోన్నారు.
మరిన్ని వార్తలు