రోహిణీలో నిప్పుల కుంపటి

30 May, 2017 23:39 IST|Sakshi
రోహిణీలో నిప్పుల కుంపటి
- తునిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత
అమలాపురం : ఒకవైపు బంగాళాఖాతంలో తుపాను.. మరోవైపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ...ఎండవేడికి ఆపసోపాలు పడుతున్న జిల్లావాసులకు ఈ రెండు వార్తలు పెద్దగా ఊరటనివ్వలేదు. జిల్లాలో వరుసగా రెండు రోజుల నుంచి పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
రోహిణీకార్తి చల్లగా ఆరంభమైనప్పటికీ రోజుల గడుస్తున్న కొద్దీ భానుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. వారం రోజులుగా మండే ఎండలకు కాస్త విరామం ఇచ్చిన భానుడు గడిచిన రెండు రోజులుగా మళ్లీ చెలరేగిపోతున్నాడు. జిల్లాలో మంగళవారం సూర్య ప్రతాపంతో  సామాన్యులు విలవిల్లాడారు. ఎండకు, వడగాల్పులు తోడుకావడంతో వాతావరణం వేడెక్కింపోయింది. తునిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వేసవి ఆరంభమైన తరువాత ఇక్కడే ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. జిల్లా కేంద్రమైన కాకినాడలో 42.6, రాజమహేంద్రవరం, ఏజెన్సీలోని చింతూరు, కోనసీమల్లో 42, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఏడు గంటల వరకు వేడుగాలలు వీస్తుండడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 
మరిన్ని వార్తలు