ఇస్కాన్‌ మందిరం.. చూసొద్దాం రండి

25 May, 2017 22:51 IST|Sakshi
ఇస్కాన్‌ మందిరం.. చూసొద్దాం రండి

భువిపై వెలసిన భూతల స్వర్గంగా భాసిల్లుతున్న అనంతపురంలోని ఇస్కాన్‌ మందిరం భక్తుల సుందర స్వప్న సాకారమై విరాజిల్లుతోంది.   అరుదైన ఈ అపురూప కట్టడం అనంతపురం శివారులోని గుత్తి రోడ్డులో సోములదొడ్డి వద్ద ఉంది. భారతీయ శిల్పకళకు,  సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ మనోహర కట్టడం జిల్లాకే తలమానికంగా నిలిచింది.  మందిర ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక చింతన భక్తులను వెన్నాడుతుంది.

శ్రీరాధాపార్థసారధుల మనోహర ప్రతిమలు జీవకళ ఉట్టిపడుతూ వింత శోభతో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పురాణ ఇతిహాసాల్లోని వివిధ ఘట్టాలు మందిరం చుట్టూ నేత్ర పర్వం చేస్తున్నాయి. సుమారు 60 అడుగుల ఎత్తుతో నిర్మించిన నాలుగు అశ్వాలు రథాన్ని లాగుతున్నట్లు నిర్మితమైన ఇస్కాన్‌ మందిరం ఏ మూల నుంచి చూసినా.. ఓ మధురానుభూతిని మిగుల్చుతోంది. రాత్రి వేళలల్లో విద్యుద్దీప కాంతులతో వెలుగులు విరజిమ్మే ఈ కృష్ణ మందిరాన్ని చూసేందుకు జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తున్న వారు ఆసక్తి చూపుతుంటారు.
- అనంతపురం కల్చరల్‌

మరిన్ని వార్తలు