ఉసురుతీస్తున్న వడగాలులు

21 May, 2017 02:09 IST|Sakshi
సింగవరంలో నిండు గర్భిణి
నిడదవోలు : నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన నిండు గర్భిణి వడదెబ్బకు గురై మృతిచెందింది. సింగవరం సర్పంచ్‌ కొండా అన్నమ్మ కుమార్తె కొయ్య సుధారాణి (25) శుక్రవారం వడదెబ్బకు గురైంది. రాత్రివేళ  ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి కాగా కుటుంబ సభ్యులు పట్టణంలోని  ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. 
ఉల్లంపర్రులో..
పాలకొల్లు సెంట్రల్‌ : వడగాల్పులు ప్రాణాలు తీస్తున్నాయి. పాలకొల్లు ఉల్లంపర్రు గ్రామానికి చెందిన రెడ్డి అప్పారావు (45) అనే వ్యక్తి గ్యాస్‌ పైప్‌లై¯ŒS తనిఖీ చేసి వస్తూ శుక్రవారం దగ్గులూరులో కుప్పకూలి మృతిచెందినట్టు తహసీల్దార్‌ దాశి రాజు తెలిపారు. శనివారం పంచనామా నిర్వహించారు.  
నరసాపురంలో..
నరసాపురం : నరసాపురంలోని వెలమపేటకు చెం దిన మజ్జి గోగులమ్మ (70) మధ్యాహ్నం 2 గం టల సమయంలో స్పృహ కోల్పోయి కన్నుమూసింది.  
మేడపాడులో.. 
మేడపాడు (యలమంచిలి): మేడపాడు పెట్రోల్‌ బంకు సమీపంలో వడదెబ్బ తగిలి పాలకొల్లు రామయ్యహాలుకు చెందిన మట్టా నాగేశ్వరరావు అనే వ్యక్తి మరణించాడు. మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
భీమలాపురంలో..
భీమలాపురం (ఆచంట) : భీమలాపురం గ్రామానికి చెందిన చిట్నీడి సుబ్బారావు (55) అనే కొబ్బరి కాయల వ్యాపారి ఉదయం సంత చేసుకుని ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు.  
యర్నగూడెంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌
యర్నగూడెం (దేవరపల్లి) : దేవరపల్లి మండలం యర్నగూడెంలో వడగాల్పులకు ట్రాక్టర్‌ డ్రైవర్‌ కంబాల రాంబాబు (47) మృతిచెందాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చిన రాంబాబు లోనికి వెళ్లి కుప్పకూలిపోయాడు. 
భీమడోలులో యాచకుడు
భీమడోలు : భీమడోలులో 55 ఏళ్ల వయసున్న యాచకుడు శనివారం వడదెబ్బతో కన్నుమూశాడు.
రేలంగిలో..
ఇరగవరం: ఇరగవరం మండలంలోని రేలంగి పాత కాలేజీ వెనుక ఉన్న జామతోటలో అదే గ్రామానికి చెందిన ఏజెర్ల బాబూరావు (40) మృతదేహాన్ని స్థానికులు గుర్తింరు. వడదెబ్బతో బాబూరావు మృతిచెంది ఉండవచ్చని ఎస్సై కేవీవీ శ్రీనివాస్‌ తెలిపారు.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు