ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు

23 May, 2017 01:45 IST|Sakshi
మొగల్తూరు: వడగాలులు మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. వడదెబ్బతో సోమవారం జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లికి చెందిన కొల్లాటి అప్పులు (59) అనే వృద్ధుడు మధ్యాహ్న సమయంలో మొగల్తూరు వచ్చి తిరిగి నడుచుకుంటూ గ్రామానికి వెళుతుండగా స్పృహ తప్పి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. పేరుపాలెం నార్త్‌ పంచాయతీ ఏటిమొండికి చెందిన తిరుమాని వెంకట్రాజు (73) అనే వృద్ధుడు పొలానికి వెళ్లి వడగాల్పులకు సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 
 
ఉంగుటూరులో పారిశుద్ధ్య కార్మికుడు
ఉంగుటూరు: ఉంగుటూరులో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు వెలగాడి శ్రీనివాసరావు (45) వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయం బయటకు వెళ్లిన శ్రీనివాసరావు గ్రామంలోని సెంటర్‌లో కుప్పకూలిపోయాడు. స ర్పంచ్‌ గంటా శ్రీలక్ష్మి, కార్యదర్శి పి.సురేష్‌ కుమార్, వా ర్డు సభ్యులు ఇక్కడకు చేరుకుని మట్టి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు కుటుంబానికి రూ.3 వేలు అందజేశారు. వడదెబ్బకు శ్రీనివాసరావు మృతిచెందినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మృతునికి భార్య మంగ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. 
 
కొవ్వూరులో రిక్షా కార్మికుడు 
కొవ్వూరు రూరల్‌: వడదెబ్బతో కొవ్వూరు పట్టణంలోని బ్రిడ్జిపేటకు చెందిన రిక్షా కార్మికుడు మొయ్యే పైడియ్య (70) అనే వృద్ధుడు మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఎండ తీవ్రతతో వారం రోజులుగా అస్వస్థతకు గురైన పైడియ్య సోమవారం మృతి చెందాడన్నారు. 
 
కుముదవల్లిలో..
పాలకోడేరు: పాలకోడేరు మండలం కుముదవల్లికి చెం దిన పస్తుల వెంకటేశ్వరరావు (47) వడగాల్పులకు మృ తి చెందాడు. నాలుగు రోజుల నుంచి వీస్తున్న వడగా లులకు తట్టుకోలేక సోమవారం ఇంట్లోనే మృతి చెం దినట్టు కుటుంబసభ్యులు చెప్పారు. వెంకటేశ్వరరావు దర్జీ వృత్తి చేస్తూ కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు