నూజీవీడు ట్రిపుల్‌ఐటీకీ సూపర్ న్యూమరరీ సీట్లు

12 Aug, 2016 19:40 IST|Sakshi

నూజివీడు ట్రిపుల్‌ఐటీ పరిధిలోని శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్న 8జిల్లాలకు 96 సూపర్ న్యూమరరీ సీట్లను కేటాయించారు. ఈ సీట్లకు ఈనెల 13న ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ట్రిపుల్‌ఐటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగు అర్జునరావు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయడం జరిగింది.

 

అయితే ఇటీవల నిర్వహించిన ప్రవేశాలలో భాగంగా ఈ ఎనిమిది జిల్లాల్లోని 96మండలాలకు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీట్లు దక్కలేదు. ఈ విషయం ఈనెల 11న నూజివీడు ట్రిపుల్‌ఐటీకి విచ్చేసిన ఛాన్సలర్ డీ రాజ్‌రెడ్డి దృష్టికి వెళ్ళడంతో ఆయన వెంటనే అన్ని మండలాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని ఆదేశించారు. దీంతో సూపర్ న్యూమరరీ సీట్లను కేటాయించి వాటిని భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు 11, విజయనగరానికి 5, విశాఖపట్నంకు 14, తూర్పుగోదావరికి 12, పశ్చిమగోదావరికి 6, కృష్ణాకు 14, గుంటూరుకు 11, ప్రకాశంకు 23 సీట్లు కేటాయించారు.
 

మరిన్ని వార్తలు