ఉద్యాన రైతులకు ఊతం

14 Aug, 2016 20:26 IST|Sakshi
నల్లజర్ల : ఉద్యాన రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, సలహాలు అందిస్తూ, ఎగుమతులు ప్రోత్సహించడం, రైతు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వివిధ పథకాలకు 2016–17 సంవత్సరంలో రాయితీలు అందిస్తున్నట్టు నల్లజర్ల ఉద్యానశాఖ అధికారి జి.లక్‌పతి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
టిష్యూకల్చర్‌ అరటి 3086 మొక్కలకు రూ.30,739, నిమ్మ 278 మొక్కలకు రూ.9,602, బొప్పాయి 3,086 మొక్కలకు రూ.18,497, జామతోటకు 1,111 మొక్కలకు రూ.17,599, జీడిమామిడి 278 మొక్కలకు రూ.12 వేలు, పూలసాగు రూ.16 వేలు, కోకోకు 500 మొక్కలకు రూ. 12 వేల రాయితీ అందిస్తారు. 
నీటి కుంటల ఏర్పాటుకు
20, 20, 4 సైజులో నీటికుంట ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌ షీటు వేసుకోవడానికి 50 శాతం రాయితీ లేదా రూ.75 వేలు రాయితీ అందిస్తారు.
రక్షిత సేద్యానికి
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అధిక విలువ గల కూరగాయలు, పూలను తక్కువ విస్తీర్ణంలో పండించి నాణ్యమైన దిగుబడులు సాధించుటకు పాలీహౌస్‌ 445 చ.మీటర్లు, షేడ్‌నెట్‌ 236 చ.మీ.కు 50 శాతం రాయితీ అందిస్తారు. 
– పంటకోత అనంతరం జరిగే నష్టాన్ని అరికట్టి పంట నాణ్యత పెంచి మార్కెటింగ్‌ చేయడానికి వీలుగా ప్యాక్‌ హౌస్‌లకు రూ. 2 లక్షలకు మించకుండా రాయితీ ఇస్తారు.  
– తేనెటీగల పెంపకం కోసం 8 పెట్టెలు, 8 తేనె టీగల తెట్టు, తేనె తీసే యంత్రం యూనిట్‌కు రూ.20 వేలు రాయితీ అందిస్తారు.
– ఉద్యాన యాంత్రీకరణలో భాగంగా చిన్న ట్రాక్టరు 20 హెచ్‌.పీ లోబడి రూ.75 వేలు, రోటావేటర్‌ 20 హెచ్‌పీకి రూ.12 వేలు, పవర్‌ టిల్లర్‌ 8 హెచ్‌పీకి Sరూ. 60 వేలు, తైవాన్‌ స్ప్రేయర్‌కు రూ.6,600 రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు. 
– పూలసాగు, బంతి, చామంతి, మల్లె, గులాబీ వంటి పూలసాగుకు ఒక హెక్టార్‌కు రూ.16 వేలు రాయితీగా ఉంటుంది.
– మల్చింగ్, కూరగాయలు, బొప్పాయి వంటి పంటలకు కలుపు రాకుండా ప్లాస్టిక్‌ షీట్లు వేసుకుంటే హెక్టారుకు రూ.16 వేలు రాయితీ ఇస్తారు. 
– హైబ్రిడ్‌ కూరగాయల విత్తనాలకు హెక్టార్‌కు రూ. 3 వేలు చొప్పున 2 హెక్టార్లకు, శాశ్వత పందిర్లకు తీగజాతి కూరగాయలసాగులో ఎకరానికి అయ్యే ఖర్చులో 50 శాతం రూ.10 వేలు మించకుండా రైతులు పండించిన కూరగాయలు, కోకో రవాణాకు ప్లాస్టిక్‌ ట్రేస్‌కు 100 ట్రేల వరకు రాయితీ అందిస్తారన్నారు.
ఆయిల్‌పామ్‌ మొక్కలపై..
ఆయిల్‌పామ్‌ మొక్కలకు 85 శాతం రాయితీ ఇస్తారు. హెక్టారుకు రూ. 8 వేలు మించకుండా 25 హెక్టార్ల వరకు ఈ రాయితీ ఉంటుంది. సాగు ప్రోత్సాహంలో భాగంగా 50 శాతం రాయితీపై 4 సంవత్సరాల పాటు రూ. 16 వేలకు మించకుండా రాయితీపై ఎరువులు అందిస్తారు. పంట సాగుకు 50 శాతం రాయితీపై హెక్టార్‌కు రూ. 3 వేలు 2 హెక్టార్ల వరకు అందిస్తారు. గెలల కోతకు ఉపయోగించే అల్యూమినియం గెడలకు రూ.1,500 రాయితీ, వర్మీ కంపోస్టు యూనిట్‌ ఏర్పాటుకు 50 శాతం రాయితీపై రూ.15 వేలు మించకుండా ఇస్తారన్నారు.
ఉద్యాన రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించుట, సాంకేతిక విజ్ఞానం అందించడం కోసం శాస్త్రవేత్తలచే 2 రోజుల పాటు శిక్షణ, శిక్షణ పొందిన రైతులు గ్రామస్థాయిలో సాంకేతిక బదిలీ లక్ష్యంగా ఉద్యాన రైతులకు తెలియజేసి, సాగులో అధిక ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించడానికి ఉద్యాన శాఖ కృషి చేస్తోందని లక్‌పతి వివరించారు. మరిన్ని వివరాలకు జి.లక్‌పతి, ఉద్యానశాఖ అధికారి సెల్‌ ః 81878 90455 నంబర్‌లో సంప్రదించవచ్చు.
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు