సూర్య @45

18 Apr, 2017 00:00 IST|Sakshi
సూర్య @45
జిల్లాలో ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం జిల్లాలోని కోవెలకుంట్లలో అత్యధికంగా 45.08 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ వేసవిలో గరిష్టంగా నమోదయిన ఉష్ణోగ్రత ఇదే. చాగలమర్రిలో 44.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రతకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గ్రామీణ ప్రజలు దాహర్తితో అల్లాడుతున్నారు. 10 రోజులకోసారి కూడా నీళ్లు సరఫరా కాని గ్రామాలు వందల్లో ఉన్నాయి. పశువుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. జిల్లాలో 750 నీటి తొట్లు ఉన్నా.. వీటిల్లోనూ చుక్కనీరు ఉండకపోవడం గమనార్హం.
 
- కర్నూలు(అగ్రికల్చర్‌)
 
మరిన్ని వార్తలు