ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలపై సర్వే

27 Sep, 2016 23:49 IST|Sakshi
పరకాల/సంగెం/జఫర్‌గఢ్‌ : అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల స్థితిగతులపై వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం సర్వే చేశారు. ఆయా రైతు కు టుంబాలపై సర్వే చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించింది. డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, కేవీ గిరిబాబు, కె.రాంబాబు, కె.రాము, బి.కృష్ణతో కూడిన అధికార బృందం మండలంలో పర్యటించింది. వెల్లంపల్లిలో బొజ్జం కొమురయ్య, సీతారాంపురంలో పేరబోయిన సంపత్, వరి కోల్‌లో కొలిపాక శ్రీహరి, రాసమల్ల అంజయ్య, సంగెం మండలం కాట్రపల్లిలో చోల్లేటి సుద¯ŒSరెడ్డి, పల్లారుగూడ గ్రామంలో పోడేటి ఐలయ్య కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఇంటి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ప్రభుత్వానికి అం దిస్తామని తెలిపారు. వారితో పరకాల ఇ¯ŒSచార్జి జేడీఏ ఎగ్గిడి నాగరాజు, ఏఈవో అనిల్‌కుమార్, విశాఖపట్టణం ఆగ్రో ఎకనామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సభ్యులు డాక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ కేవీ.గిరి, డాక్టర్‌ కె.రాంబాబు, డాక్టర్‌ పి.రాము, డాక్టర్‌ బి.క్రిష్ణ, జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వీరూనాయక్, ఏఓ ఆర్‌.వేణుగోపాల్‌ పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు