మూల్యాంకనంపై మీమాంస

11 Apr, 2017 00:50 IST|Sakshi
మూల్యాంకనంపై మీమాంస
నల్లజర్ల/నిడమర్రు : విద్యా సంవత్సరం పూర్తయి 10 రోజులు దాటింది. ముందెన్నడూ లేనివిధంగా వేసవి సెలవుల ముందే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సమ్మెటివ్‌–3 (వారి్షక) పరీక్షల జవాబు పత్రాల సంగ్రహణాత్మక మూల్యాంకన (సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌) విషయంలో విద్యాశాఖ నిర్ణయాలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా వీటి మూల్యాంకన వాయిదా పడగా, ఎట్టకేలకు  సోమవారం నుంచి 6, 7 తరగతుల జవాబు పత్రాల్లో 5 శాతం మూల్యాంకన మాత్రమే ప్రారంభమైంది. అందుబాటులో ఉన్న సబ్జెక్ట్‌ నిపుణులతో ఈ ప్రక్రియను అధికారులు హడావుడిగా ప్రారంభించారు. అయితే, 8, 9వ తరగతుల జవాబు పత్రాల మూల్యాకనంపై అధికారులు నేటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో మీమాంస నెలకొంది. 
 
టెన్‌త స్పాట్‌తో ఆలస్యం
10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్‌ వేల్యూయేషన్‌)లో హైసూ్కల్‌ ఉపాధ్యాయులు వి«ధులు నిర్వహిస్తున్నారు. మరోపక్క పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించినట్టు చెబుతూనే ‘సవరణాత్మక బోధన’ అనే 100 రోజుల కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటికే పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా సవరణాత్మక బోధన తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో బాహ్య మూల్యాంకనానికి వెళ్లేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం లేదు. ఫలితంగా 6 నుంచి 9వ తరగతుల మూల్యాకనం మూలనపడింది.
 
అరకొరగానే ప్రారంభం 
జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 2.18 లక్షల మంది విద్యార్థులు సమ్మెటివ్‌–3 పరీక్షలు రాశారు. ప్రతి తరగతికి 6 చొప్పున సుమారు 14 లక్షల వరకూ జవాబు పత్రాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని మూల్యాంకన అయినకాడికి పూర్తి చేసేలా జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.  8, 9వ తరగతుల మూల్యాకనం 100 శాతం జవాబు పత్రాలను బాహ్య మూల్యాంకనం చేయాల్సి ఉంది. సీసీఈ విధానంలో 8, 9వ తరగతుల్లో లభించిన మార్కుల ఆధారంగా పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులు ఇవ్వాల్సి ఉం టుంది. దీనివల్ల విద్యార్థుల జవాబు పత్రాలను వారు చదివిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు దిద్దితే అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో వాటిని బాహ్య మూల్యాకనం (బయటి ఉపాధ్యాయులతో దిద్దించడం) చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ జవాబు పత్రాలు 1.8 లక్షల వరకూ ఉంటాయి. వీటిని దిద్దాలంటే మండలానికి 50 నుంచి 60 మంది ఉపాధ్యాయులు అవసరం. దీంతో టెన్త్‌ స్పాట్‌ ముగిసిన తర్వాత ఆ సిబ్బందిని కలుపుకుని ఈనెల 20 లోపు మూల్యాకనం పూర్తి  చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. మొత్తం మీద పదో తరగతి స్పాట్‌ వేల్యూయేషన్‌ మాదిరిగా తొలిసారి 8, 9 తరగతుల మూల్యాకనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 
20లోగా పూర్తి చేస్తాం
పదవ తరగతి స్పాట్‌ వేల్యూయేషన్‌ వల్ల సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ కారణంగానే సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–3 బాహ్య మూల్యాకనం ప్రక్రియ ఆలస్యమైంది. ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని తొలివిడతగా 6, 7 తరగతులు, తర్వాత 8, 9 తరగతులు  బాహ్య మూల్యాంకన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. 10వ తరగతి స్పాట్‌కు వెళ్లిన ఉపాధ్యాయులంతా ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంటారు. 6, 7 తరగతులు బోధించే ఉపాధ్యాయులను టెన్త్‌ స్పాట్‌ నుంచి∙తప్పించాం. మొత్తంగా ఈనెల 20వ తేదీలోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేస్తాం.  – ఆర్‌ఎస్‌ గంగాభవాని, డీఈవో 
 
మరిన్ని వార్తలు