వర్సిటీ సొమ్ము దుబారా

10 Aug, 2016 22:22 IST|Sakshi
ఎస్వీయూ పరిపాలన భవనం
– ఆర్భాటం కోసం అవుట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ
– వీసీ ఇంటి దగ్గర రోజుకు 15 మంది భద్రత
– నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బంది
– అవసరం లేకున్నా మరో 30 మంది కోసం కసరత్తు 
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : 
 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో దుబారా పెరిగింది. రకరకాల ఖర్చుల పేరుతో యూనివర్సిటీ సొమ్మును ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం ప్రశ్నించకపోవడంతో ‘వర్సిటీ అధికారులు ఆడిందే ఆట...పాడిందే పాటగా’ మారింది. అవసరం లేకపోయినా  క్యాంపస్‌ సెక్యూరిటీ పేరుతో ఏడాదికి లక్షలకు లక్షలు వాడేస్తున్నారు. ఆర్భాటం కోసం అడ్డగోలు నియామకాలు జరిపి అడ్డూ అదుపు లేకుండా వర్సిటీ సొమ్ము వాడేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ కోసం ఏడాదికి రూ.7.50 లక్షల ఖర్చు చేస్తున్న వర్సిటీ అధికారులు తాజాగా మరో 30 మందిని అదనపు భద్రత కోసం నియమించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 
 ఎస్వీయూలో 30 మంది పర్మినెంట్, ఎన్‌ఎంఆర్‌ సెక్యూరిటీ సిబ్బంది  ఉన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల సంగతెలా గున్నా ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు మాత్రం ఏడేళ్లుగా నెలకు రూ.9 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తోన్న వైఎస్‌ ఛాన్సలర్‌ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే అవుట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ ఏర్పాటు వైపు దృష్టి పెట్టారు. ఉన్నపళంగా 60 మంది భద్రతా సిబ్బందిని అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకున్నారు. వీరికి నెలకు రూ.10,500 చొప్పున యూనివర్సిటీ చెల్లిస్తోంది. వాస్తవానికి ఈ సెక్యూరిటీ అవసరం లేదు. ముందెన్నడూ చెప్పుకోదగ్గ నేరాలు జరగలేదు. ఆస్తి నష్టపోయిన దాఖలాలూ లేవు. అలాంటప్పుడు వీసీ అవుట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీని ఎందుకు నియమించారో అర్థం కావడం లేదు. వీరికి వేతనాల కింద ఏడాదికి రూ.7.50 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది 60 మంది, ఎన్‌ఎంఆర్‌ సిబ్బంది 18, పర్మినెంట్‌ ఉద్యోగులు మరో 12 మంది...మొత్తం 90 మంది సెక్యూరిటీ సిబ్బంది పగలూ రాత్రి వర్సిటీలో భద్రతా విధులను నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ వేతనాలు కింద నెలకు రూ. 12 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. 
భద్రత వర్సిటీకా...వీసీ బంగ్లాకా??
మునుపెన్నడూ లేనంత భద్రత వీసీ బంగ్లా ముందు కనిపిస్తోంది. వీసీ  బంగ్లా చుట్టూ షిప్టుకు అయిదుగురు చొప్పున మూడు షిప్టుల్లో సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటున్నారు. వీరు కాకుండా గార్డెనర్లు, వంట మనుషులు, స్వీపర్లుతో కలిపి మొత్తం 25 మంది పనివారలను వీసీ బంగ్లా విధులకు కేటాయిస్తున్నారు. గతంలో పనిచేసిన వీసీ లెవ్వరికీ ఇంత భద్రత లేదు. మరో 30 మందిని అదనంగా అవుట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ సిబ్బందిని తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ఖరారులోనూ నిబంధనలకు నీళ్లొదిలి తమకిష్టమైన ఏజెన్సీకే సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్టు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. 
 
 డీజిల్, విమాన ఛార్జీల ఖర్చు మోత
ఏడాదిగా విమాన ఛార్జీలు, డీజిల్‌ ఖర్చులు కూడా పెరిగాయి. వీసీ మినహా మిగతా అధికారులు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు విమాన ప్రయాణించాల్సి ఉంది. కీలకమైన ఒకరిద్దరు అధికారులు హైదరాబాద్‌ వెళ్లే సందర్భాల్లో విమానంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. యూనివర్సిటీలో డీజిల్‌ బిల్లులు కూడా వేలు దాటి లక్షల్లో కనిపిస్తున్నాయి.  ఓ అధికారి ప్రతి శనివారం సొంత పనుల కోసం యూనివర్సిటీ వాహనాన్ని 200 కిలోమీటర్ల మేర వాడుతున్నట్లు సమాచారం. ఓ పక్క వర్సిటీ క్యాంపస్‌లో అంతర్గత రోడ్లు దారుణంగా ఉన్నాయి. పదేళ్ల కిందట వేసిన తారురోడ్లు పూర్తిగా §ð బ్బతిని రాళ్లు లేచాయి. చాలా చోట్ల ఆర్‌వో ప్లాంట్లు పనిచేయడం లేదు. వీటి కోసం ని«ధులు కేటాయించడంలో అలసత్వాన్ని కనబరిచే అధికారులు అనవసర ఖర్చులపై మాత్రం ఆసక్తి చూపుతున్నారు.  
 
 
 
మరిన్ని వార్తలు