'తిరుపతిని హిందు సెక్యురిటీ జోన్గా ప్రకటించాలి'

17 Mar, 2016 20:28 IST|Sakshi

తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి ఉగ్రవాదుల ముప్పు ఉందని  శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. తిరుపతిని హిందు సెక్యురిటీ జోన్గా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. అలాగే నగరంలోని మద్యం షాపులు ఎత్తివేయాలని, అంతేకాకుండా ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు అనుమి ఇవ్వరాదని అన్నారు.

 

అంతేకాకుండా వకుళమాతకు ఆలయం నిర్మించాలని, లేని పక్షంలో వందలాదిమందితో దీక్ష చేపట్టనున్నట్లు స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వకుళమాత గుడి కట్టించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు.

మరిన్ని వార్తలు