స్వైపింగ్‌.. కమీషన్‌

18 Dec, 2016 23:00 IST|Sakshi
స్వైపింగ్‌.. కమీషన్‌
* మినీ ఏటీఎంలుగా ‘స్వైపింగ్‌’
నరసరావుపేటలో దందా
 
నరసరావుపేట ఈస్ట్ : పెద్దనోట్ల రద్దు కష్టాలు రోజురోజుకో మలుపులు తిరుగుతున్నాయి.  పట్టణంలో పెట్రోల్‌ బంక్‌లు, షాపింగ్‌ మాల్స్‌ మినీ ఏటీఎంలుగా మారాయి. రూ. 2 వేల నోట్లకు చిల్లర లేక అల్లాడుతున్న ప్రజలకు స్వైపింగ్‌ మిషన్లే దిక్కయ్యాయి. రూ. 2 వేలకు స్వైప్‌ చేయించుకొని కొద్దిపాటి కమిషన్‌ తీసుకొని మిగతా నగదు ఇస్తున్నారని సమాచారం. ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో గంటల కొద్దీ నిలుచునే బదులు కమిషన్‌ పోయినా అవస్థలు తప్పుతాయని ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార సంస్థల అధినేతలు, గుమాస్తాలు ఏదో ఒకటి కొన్నట్లు బిల్లు సృష్టించి, ఆ మొత్తాన్ని అవసరమైన వారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థల స్థాయిని బట్టి రూ.100 నుంచి రూ.10 వేల వరకు నోట్లు మార్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తుల అవసరాలను బట్టి 2 నుంచి 10 శాతం వరకు కమీషన్‌ వసూలు చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వార్తలు