స్వైపింగ్‌తోనే సరుకులు

19 Nov, 2016 01:28 IST|Sakshi
స్వైపింగ్‌తోనే సరుకులు

నగదు లేక ప్రజల ఇబ్బందులు  
పాత నోట్లపై అప్పుడే నిషేధం
పెట్రోల్ బంకుల్లోనూ మిషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్

వరంగల్ : నగరంలోని ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల కోసం తప్పని పరిస్థితుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించక తప్పడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పాత రూ.500, రూ.1000 నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. పెద్ద నోట్లకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తామన్నా వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. పాత నోట్లు తీసుకుని బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని, ఇదంతా ఎందుకని పెద్ద నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం స్వైపింగ్ మిషన్ల ద్వారా చిల్లర విక్రయాలు కొనసాగిస్తున్నామన్నారు. దీనికి తోడుగా హోల్‌సేల్ వ్యాపారస్తులు ఇచ్చిన  సరుకులకు పాత నోట్లు తీసుకోవడం లేదని, అందువల్ల తాము కూడా కొత్త నోట్లకు, చిల్లర నోట్లకే సరుకులు విక్రరుుస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పలు కిరాణ షాపుల యాజమానులు  ఇప్పుడిప్పుడే స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. డిసెంబర్ 31వరకు బ్యాంకులు పాత నోట్లు తీసుకుంటామని ప్రకటనలు చేసినా వ్యాపారులు మాత్రం ఇప్పటి నుంచి పెద్ద నోట్లపై నిషేధం అమలు చేస్తున్నారు.

 కానరాని రూ.500 నోట్లు...
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రూ.500 నోట్లు దర్శనమిచ్చినా నగరంలో వీటి జాడే లేకుండా పోరుుంది. పలు ఏటీఎంలలో రూ.100నోట్లనే  పెడుతున్నారుు. ఇలా ఏటీఎంలలో పెట్టిన నోట్లు నిమిషాల్లో ఖాళీ కావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్లలో ఖర్చుల నిమిత్తం దేవుళ్లకు వేసిన ముడుపులు సైతం బయటకు తీయక తప్పడం లేదని తెలుస్తోంది. ఈ ఇబ్బందులు మరెన్ని రోజులు ఉంటాయో అని నగరవాసులు అంటున్నారు.

లీటర్‌కు నో... రూ.300కు ఒకే...
రద్దైన పెద్ద నోట్లతో మోటార్‌బైక్‌లు ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్‌పంపుల్లో చిల్లర నోట్లకే పెట్రోల్ పోస్తున్నారు. రూ.500 ఇచ్చి లీటర్, రెండు లీటర్లు పోయమంటే లేదన్న సమాధానం వస్తోంది. చివరకు రూ.250 నుంచి 300లో పోసుకుంటేనే మిగిలిన చిల్లర ఇస్తున్నారు. నిత్యావసర వస్తువుల్లో పెట్రోల్ కూడా ఒక ప్రధానం కావడంతో పోరుుంచుకోక తప్పడం లేదని నగర వాసులు వాపోతున్నారు. ఆర్‌బీఐ పెద్ద నోట్లు రద్దు చేసినా వాటి స్థానంలో రూ.100 నోట్లను ఎక్కవ సంఖ్యల్లో అందుబాటులోకి తెస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావని పలువురు వాపోతున్నారు. చివరకు పెట్రోల్‌పంపుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోంది.

మరిన్ని వార్తలు