‘సీమ’పై బలంగా రుతుపవనాలు

27 Jul, 2016 00:40 IST|Sakshi
‘సీమ’పై బలంగా రుతుపవనాలు
రుతుపవనాలు,రాయలసీమ,కోస్తాంధ్ర,sycylon,rayalaseema,kostandra
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమపై రుతుపవనాలు బలంగా ఉన్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమలపై అల్పపీడనద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అదే సమయంలో రాయలసీమల్లోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాయలసీమలో భారీగాను, కోస్తాంధ్రలో ఓ మోస్తరు గాను వానలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో పాలసముద్రంలో 11, నల్లమడలో 7, హిందుపూర్, కుప్పం, గోరంట్ల, పెనుకొండలలో 6, లేపాక్షి, రాజుపాలెం, కోయిలకుంట్లలో 5, అమలాపురం, దువ్వూరు, జమ్మలమడుగు, ధర్మవరం, పుంగనూరు, చాపాడుల్లో 4, మంగళగిరి, టెక్కలి, వి.రామచంద్రపురం, కొండాపురం, ఓబులచెరువు, తిరుపతి, చిలమత్తూరు, బత్తలపల్లె, వేంపల్లె, సింగనమల, పలమనేరు, ముద్దనూరు, వేంపల్లె, బనగానపల్లె, అవుకుల్లో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా