క్రీడా సంస్కృతి పెంపొందించడమే లక్ష్యం

10 Sep, 2016 00:36 IST|Sakshi
క్రీడా సంస్కృతి పెంపొందించడమే లక్ష్యం

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని తేవడమే ఆర్డీటీ ప్రధాన లక్ష్యమని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనlదేశంలో ఎందరో ‘సింధు’లను తయారు చేయవచ్చన్నారు. ఏదైనా సాధించాలంటే తనపై తనకు నమ్మకం రావాలని చెప్పారు.

రాష్ట్రంలో చాలా చోట్ల పాఠశాలలు ఉన్నాయి. కానీ ఆట స్థలాలు లేవు. అయినా అందిన అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. హాజరైన క్రీడాకారులు మంచి ఆట తీరుతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం మాంచో ఫెర్రర్, డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్‌ను సన్మానించారు. టోర్నీలో పాల్గొనేందుకు రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో టేబుల్‌æటెన్నిస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అక్బర్‌సాహెబ్, రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణ, ఎస్‌ఎస్‌బీఎన్‌ కరస్పాండెంట్‌ పీఎల్‌ఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు