తాడేపల్లి నుంచి ట్రాక్టర్‌పై ఇడుపులపాయకు..

1 Sep, 2016 23:22 IST|Sakshi
తాడేపల్లి నుంచి ట్రాక్టర్‌పై ఇడుపులపాయకు..
  •  ఏడేళ్లుగా వైఎస్‌కు ఘన నివాళి అర్పిస్తున్న అభిమాని
  •    
     తాడేపల్లి రూరల్‌ (గుంటూరు) :  మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించి ఏడు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజాజీవితాల్లో ఇంకా నిలిచి ఉన్నారనడానికి, ఎందరికో స్ఫూర్తినిస్తున్నారనడానికి ఓ అభిమాని చేస్తున్న ‘ఇడుపులపాయ దీక్షా పయనమే’ ఉదాహరణ. బొంతు అప్పిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణానికి చెందినవారు.   దివంగత రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని  తాడేపల్లి పట్టణం నుంచి మహానేత సమాధి ఉన్న ఇడుపులపాయ వరకు ఈయన తన ట్రాక్టర్‌పై ప్రయాణించి, మహానేత సమాధికి పూలమాల వేసి,   ఘనంగా నివాళులర్పించి తిరిగి రావడం గత ఏడు సంవత్సరాలుగా జరుగుతోంది. అదే రీతిలో గురువారం సాయంత్రం 3 గంటలకు అప్పిరెడ్డి తాడేపల్లి వైఎస్సార్‌ సెంటర్‌ నుంచి తన ట్రాక్టర్‌పై ఇడుపులపాయకు పయనమయ్యారు. సుమారు 18 గంటలు ప్రయాణించి ఇడుపులపాయ చేరుకుని, మహానేతకు  నివాళులర్పించనున్నారు. ప్రజల  ప్రాథమిక అవసరాలు అయిన అన్నం, విద్య, గహ కల్పన అందించిన రాజశేఖర్‌రెడ్డి తనకు దైవంతో సమానమని, ఆ మహనీయుని స్ఫూర్తి చిరకాలం నిలిచి  భావి యువత రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు వారసులుగా అవతరించాలనే ధఢ సంకల్పంతో తాను తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు దీక్షాయాత్రను చేస్తున్నట్టు బొంతు అప్పిరెడ్డి చెబుతున్నారు.    బొంతు అప్పిరెడ్డి ట్రాక్టర్‌ ప్రయాణాన్ని వైఎస్సార్‌ సీపీ తాడేపల్లి పట్టణ కన్వీనర్‌ బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, నాయకులు కొల్లి చంద్రారెడ్డి, పాటిబండ్ల సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు జెండా ఊపి  ప్రారంభించారు. 
     
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా