తడారి.. చేలు ఎడారి

12 Feb, 2017 00:51 IST|Sakshi
తడారి.. చేలు ఎడారి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కాలువలు తడారుతున్నాయి. చేలు ఎడారులను తలపిస్తున్నాయి. రబీలో సాగునీటి ఎద్దడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వంతులవారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో శివారు ప్రాంతాల్లోని చేలు నీరందక బీటలు వారుతున్నాయి. అయితే, చేపల చెరువులకు మాత్రం మోటార్ల సా యంతో యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. దీంతో వరి పండిం చే డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. 80 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని స్పష్టం చేసింది. సాధారణం గా రబీకి చివరి రోజుల్లో సీలేరు నుంచి అదనపు జలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది తొలి దశలోనే సాగునీటి ఎద్దడి తలెత్తిం ది. నాట్లు పూర్తికాకుండానే జనవరి 22 నుంచి వంతులవారీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల శివారు ప్రాంతాల్లోని 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరు అందటం లేదు. చాలాచోట్ల ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి నీరు తోడుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల పం ట కాలువలు, బోదెలు నీరులేక తడారిపోవడంతో పొలాలు ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇదిలావుంటే.. వంతులవారీ విధా నం అమలయ్యే ప్రాంతాల్లో చేపల చెరువులకు కాలువ నీటిని తోడేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు, ఉండి నియోజకవర్గాలో కొన్నిచోట్ల వరి పొలాలు బీటలు వారుతున్నా యి. నీటికోసం రైతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి దుబ్బు కట్టే దశలో ఉంది. పొట్ట దశ, ఈనిక దశలో నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో తగినంత నీరు అందకపోతే ఎలుకలు చేరి పంటను నాశనం చేస్తాయి. ఇప్పటికే తెగుళ్లు ఆశించి పురుగు మం దుల కోసం ఎక్కువ పెట్టుబడి పె ట్టాల్సి వస్తోంది. ప్రస్తుత అవసరాలకు 6 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే తప్ప శివారు ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేదు. అయితే, 4 వేల క్యూసెక్కులకు మించి నీరివ్వడం లేదు. మరోవైపు పంట కాలువల్లో గుర్రపుడెక్క, తూడు, కర్రనాచు పెరిగిపోయింది. వీటిని తొలగించే చర్యలు చేపట్టలేదు. పంట బోదెలు ఆక్రమణలకు గురికావడంతో కుచించుకుపోయా యి. డెల్టా ఆధునికరణ పనులు సక్రమంగా జరగకపోవడం వల్లే శివారు ప్రాంతాలకు నీరందని ప రిస్థితి ఏర్పడింది.  ఏళ్ల తరబడి ఆ ధునికీకరణ పనులు కొనసాగుతూ నే ఉన్నాయి. రైతులు ఇప్పటికే ఎకరాకు రైతులు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టారు.  నీటిసమస్య వల్ల దిగుబడి తగ్గితే నష్టపోవాల్సి వస్తుంది. చాలాచోట్ల లస్కర్ల కొరత వల్ల వంతులవారీ విధానం కూడా సక్రమంగా అమలు కా వడం లేదు. గత ఏడాది శివారు ప్రాంతాలకు అయిల్‌ ఇంజిన్లు పెట్టుకుంటే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా చాలాచోట్ల అమలు కాలేదు.  ఈ రబీలో ఆ భరోసా కూడా రైతులకు లేకుండా పోయింది. 
 
 
 
 
 
మరిన్ని వార్తలు