ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో అవసరం

25 Feb, 2017 00:05 IST|Sakshi
ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో అవసరం
కర్నూలు(టౌన్‌): ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో క్రీడ ఎంతో అవసరమని తైక్వాండో జిల్లా కార్యదర్శి జి. శోభన్‌బాబు అన్నారు. శుక్రవారం స్థానిక ఏ.క్యాంపు మాంటిస్సోరి స్కూలు ఆవరణలో జిల్లా స్థాయి తైక్వాండో సబ్‌జూనియర్‌ బాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో సబ్‌ జూనియర్‌ బాలికలు 100 మంది పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తైక్వాండో జిల్లా కార్యదర్శి జి. శోభన్‌ బాబు మాట్లాడుతూ మార్షల్‌ ఆర్ట్స్‌ తైక్వాండో అభ్యసించడంతో క్రమబద్ధమైన జీవనం అలవాడుతుందన్నారు. బాలికలు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు.  కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు, మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు