నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు చర్యలు

20 Aug, 2016 00:20 IST|Sakshi
ఏలూరు (మెట్రో) : ప్రపంచ బ్యాంక్‌ నిధులతో విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకున్నామని విద్యుత్‌ పంపిణీ సంస్థ వరల్డ్‌ బ్యాంకు డైరెక్టర్‌ రమేష్‌ ప్రసాద్‌ తెలిపారు. ఏపీఈపీడీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ తూర్పుప్రాంత విధ్యుత్‌ పంపిణీ సంస్థ) ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్పు చేసి నూతనంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ విద్యుత్‌ పథకంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్‌ సదుపాయాన్ని కల్పించామన్నారు. అంతే కాకుండా కొత్తలైన్లు ఏర్పాటు చేసి గృహ వినియోగానికి, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా  చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులందరూ ఉత్తమ పనితీరు చూపించి జిల్లాకు ఉన్నత పేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కొత్తగా జిల్లాలో సబ్‌స్టేçÙన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ కేవీసీహెచ్‌ పంతులు, డీఈటీ కె.రఘునాథ్‌బాబు, ఏడీ అంబేడ్కర్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు