నీటి సౌకర్యం ఉండేలా చూడాలి

19 Sep, 2016 23:56 IST|Sakshi
నీటి సౌకర్యం ఉండేలా చూడాలి
తిప్పర్తి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతరం నీటి సౌకర్యం ఉండేలా చూడాలని  సర్వశిక్ష అభియాన్‌ ఈఈ వైద్యం భాస్కర్‌ సూచించారు. సోమవారం తిప్పర్తిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో 513 పాఠశాలల్లో టాయిలెట్లకు, తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.ఈ పనులను నెల రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల స్థానంలో కొత్తవాటిని నిర్మించేందుకు నివేదికలు పంపనున్నట్లు తెలిపారు.  కేజీబీవీల్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ.. తరగతి గదుల నిర్మాణం కోసం  తన సొంత నిధుల్లో పదిశాతం ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరుణశ్రీ, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రఘు, యాదయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు