కళా ప్రతిభే కొలమానం

1 Aug, 2016 19:18 IST|Sakshi
సినీ దర్శకుడు మురళీ తెడ్ల 
 
తెనాలి : సినిమాకు సంబంధించిన ఏదో ఒక కళలో ప్రవేశమున్న యువతకు తగిన అవకాశం కల్పించాలన్నది తమ ఉద్దేశమని ‘రా...కిట్టు’ సినీ దర్శకుడు మురళి తెడ్ల చెప్పారు. విధాత ఫిలిమ్స్‌ వారి ప్రొడక్షన్స్‌ నెం.2 సినిమా ఆడిషన్‌ కార్యక్రమం ఆదివారం స్థానిక కవిరాజు పార్కులోని సీనియర్‌ సిటిజన్స్‌ భవనంలో నిర్వహించారు. ప్రారం¿¶ æసభకు బెల్లంకొండ వెంకట్‌ అధ్యక్షత వహించారు. ఉలి దెబ్బలు తిన్న రాయి.. దేవతామూర్తిగా మారి ప్రజల పూజలు అందుకుంటుందని, అలాగే కష్టపడి పని చేసిన వ్యక్తులు ఏదో ఒక సమయంలో గుర్తింపునకు నోచుకుంటారని అన్నారు. హైదరాబాద్‌లో సినీ స్టూడియోల చుట్టూ తిరక్కుండా వారి టాలెంట్‌ను నిరూపించుకున్న యువతకు తమ సినిమాలో అవకాశం ఇస్తామని తెలిపారు. సినీ నిర్మాత జె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చెప్పాల్సిన సందేశాన్ని సినిమా ద్వారా చెబితే చేరగలుగుతుందని, ఇందుకు వ్యయప్రయాసలు తప్పవన్నారు. సహ నిర్మాత పెద్దసింగు, ప్రతినిధి సినిమా నిర్మాత గుమ్మడి రవీంద్ర, కెమెరామేన్‌ బి.చక్రధర్, రా...కిట్టు సినిమా నటులు అలపర్తి వెంకటేశ్వరరావు, వెలగా సుభాష్‌చంద్రబోస్, ఎంఎస్‌ ఛార్లీ, సంగీత దర్శకుడు జూనియర్‌ బాజీ మాట్లాడారు. అనంతరం ఆడిషన్‌ నిర్వహించారు. యువకులు హాజరయ్యారు.
 
మరిన్ని వార్తలు