హైదరాబాద్-అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు!

8 Feb, 2016 19:04 IST|Sakshi
హైదరాబాద్-అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు!

చౌటుప్పల్: తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఇంకా నిర్మించని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసు నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి.  సోమవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో  విలేకరులతో మాట్లాడిన భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్  ఈ విషయాన్ని వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జురుగుతున్నాయని, దానితోపాటే 65వ నంబర్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా అభివృద్ధి చేసేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారని  ఎంపీ తెలిపారు.  వచ్చే వారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ 65వ నెంబర్ జాతీయ రహదారిని పరిశీలించేందుకు రానున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం జంటనగరాల నుంచి విజయవాడకు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లే తప్ప హైస్పీడ్ రైళ్లేవీ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. కొత్త నెట్ వర్క్ ఏర్పాటుతో ఆ లోటు పూడే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు