ఫలించిన తల్లి పోరాటం

13 Sep, 2016 07:04 IST|Sakshi
బిడ్డను తల్లికి అప్పగించిన మహిళా పోలీసులు
పలమనేరు(చిత్తూరు): భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్ఫర్థలు గొడవకు దారి తీసింది. తనకే కావాలంటే తొమ్మిది నెలల బిడ్డను తీసుకుని వెళ్లాడు. అప్పటి నుంచి ఆ బిడ్డ కోసం తల్లి పోరాటం సాగించింది.  స్థానిక మహిళా పోలీసుల చొరవతో ఆ బిడ్డ మళ్లీ సోమవారం తల్లి బడికి చేరింది.  ఆ వివరాలు ఇవి.  పెద్దపంజాణి మండలం మాడీకి చెందిన జయలక్ష్మితో శాంతిపురానికి చెందిన కిరణ్‌కుమార్‌కు వివాహమైంది.

కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఏడాది క్రితం గొడవలు జరిగి జయలక్ష్మి పుట్టింటికి చేరింది. పాలు తాగే తొమ్మిది నెలల బిడ్డను కిరణ్‌కుమార్‌ తన వద్దే ఉంచుకున్నాడు. బిడ్డ కోసం జయలక్ష్మి  పోరాటం సాగించింది. ఫిర్యాదు అందుకున్న స్థానిక ఉమెన్‌వింగ్‌ పోలీసులు సోమవారం భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ చేశారు. దీంతో పది రోజుల్లో వీరిరురూ కలసి కాపురం చేసేలా ఉంటామని చెప్పారు. బిడ్డను కూడా తల్లికే అప్పగించినట్టు ఏఎస్‌ఐ కరీమున్నీసా తెలిపారు. మహిళా కానిస్టేబుళ్లు ఉష, సుజాత తదిరులు ఉన్నారు.
>
మరిన్ని వార్తలు