మళ్లీ చొరబడిన తమిళ జాలర్లు

11 Aug, 2016 22:27 IST|Sakshi
తడ : పులికాట్‌ సరస్సులో చేపల వేట విషయమై గత కొన్నేళ్లుగా సాగుతున్న వివాదం తాజాగా మళ్లీ మొదలైంది. తాజాగా తమిళనాడుకు చెందిన చిన్నమాంగోడు, పెద్దమాంగోడు, పుదుకుప్పం జాలర్లు రెండు రోజులుగా ఆంధ్ర హద్దుల్లోని ప్రాంతంలో చేపల వేట కొనసాగిస్తున్నట్టు జాలర్ల సంఘ నాయకుడు బొమ్మన్‌ ధనుంజయ గురువారం తెలిపారు. దాదాపు పది పడవల్లో తమిళ జాలర్లు ఆంధ్రా హద్దుల్లోకి ప్రవేశించడంతో అక్కడ వేట సాగిస్తున్న ఆంధ్రా జాలర్లు వివాదాలు తలెత్తకుండా అక్కడి నుంచి వెనక్కు తిరిగి వచ్చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఎస్‌ఐకి ఫిర్యాదు చేశామని, న్యాయస్థానం ద్వారా పరిష్కరించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు