తమిళ కూలీల నిర్బంధం

1 Feb, 2017 00:51 IST|Sakshi
తమిళ కూలీల నిర్బంధం

మైదుకూరు టౌన్‌ : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాతపాళెంలో మంగళవారం ఆ గ్రామస్తులు నలుగురు తమిళ కూలీలను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు తమిళ కూలీలను స్మగ్లర్‌ తీసుకొచ్చి జాతీయ రహదారి పక్కన వదిలేసి వెళ్లగా, వారికి ఎటుపోవాలో అర్థం కాక సమీపంలో ఉన్న పాతపాళెం గ్రామంలో వరిచెత్తలో దాక్కొన్నారు. బ్రహ్మయ్య అనే గ్రామస్తుడు వరిచెత్త వామి వేస్తుండగా చెత్త కదులుతుండటంతో కేకలు వేసి స్థానికులను పిలిచాడు. గ్రామస్తులు గుమికూడి వరిచెత్తలో దాక్కొని ఉన్న నలుగురు తమిళ కూలీలను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. కూలీల వద్ద ఉన్న సెల్‌ ఫోన్ల ఆధారంగా వారిని ఇక్కడికి ఎవ్వరు తీసుకొచ్చారు అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు