తెలంగాణలో ఇంకా దొరలపాలనే : తమ్మినేని

5 Dec, 2016 04:00 IST|Sakshi
తెలంగాణలో ఇంకా దొరలపాలనే : తమ్మినేని

సదాశివనగర్/ గాంధారి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ కష్టాలు తీరతాయని, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ఈ ప్రాంత ప్రజలకు నిరాశే ఎదురైందని, ఇంకా దొరల పాలనే సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ‘సామాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ధి’ కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆదివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్, గాంధారి మండలాల మీదుగా సాగింది. తమ్మినేని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.

ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ మాటలకే పరిమితమైందన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. కేసీఆర్ హైదరాబాద్‌లో కూర్చుని ప్రజలందరూ బాగున్నారని చెబుతున్నారన్నారు. ఆయన క్షేత్ర స్థారుులో పర్యటిస్తే ప్రజలెలా ఉన్నారో తెలుస్తుందన్నారు. కాగా, విద్యార్థులకు మూడేళ్లుగా ఉన్న ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులను వెంటనే చెల్లించాలని తమ్మినేని సీఎంకు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు