ట‘మోత’

28 Jun, 2017 23:28 IST|Sakshi
ట‘మోత’
–కిలో రూ.60
 
కర్నూలు (వైఎస్‌ఆర్‌సర్కిల్‌) : పప్పు కూరల్లో తరచూ వాడే టమాట ధర అమాంతం పెరిగింది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 వరకు ఉండగా..ఇప్పుడు ఏకంగా రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. కర్నూలు రైతు బజారులో కిలో రూ.60లకు విక్రయిస్తుండగా, బయట మార్కెట్‌లో రూ.70 వరకూ అమ్ముతున్నారు. దీంతో టమాట కొనేందుకు పేద, మధ్య తరగతి వారు వెనకడుగు వేస్తున్నారు. టమాటతో పాటు మిర్చి ధర కూడా పెరిగింది. కిలో రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు విస్తుపోతున్నారు. ధరలు నిలకడగా ఉన్నప్పుడు టమాట చట్నీ, పచ్చికారం చట్నీతో టిఫిన్‌ వడ్డించే హోటళ్లలో నేడు నీరు, కారం కలిపిన పళ్లీల చట్నీతోనే సరిపెడుతున్నారు. ఓ మోస్తరు హోటళ్లు మినహాయిస్తే చిన్న చిన్న కాకా హోటళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కర్రీ పాయింట్ల విషయానికొస్తే కేవలం చట్నీ, ఆకుకూరతోనే సరిపెడుతున్నారు. దీంతో కర్రీ పాయింట్లపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగులు చట్నీ భోజనంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
 
 
మరిన్ని వార్తలు