ఐదు కోట్ల మెుక్కలు నాటాలి

2 Aug, 2016 23:49 IST|Sakshi
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  • హరితహారంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
  • ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
  • హన్మకొండ: హరితహారంలో జిల్లాలో ఐదు కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మంది రంలో మంగళవారం హరితహారం కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ హరితహారంలో జిల్లా లక్ష్యం 4 నుంచి 5 కోట్ల మొక్కలకు పెరిగిందన్నారు. అధికారులు ప్రణాళికను తయారు చేసుకుని జిల్లాలో విరివిగా మెు క్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. గత ఏడాది హరితహారంలో మన జిల్లా మొదటì æస్థానంలో నిలిచిందన్నారు. ప్ర స్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున అన్ని వర్గాల ప్రజలను మెుక్కలు నాటడంలో భాగస్వాములను చేసి వరంగల్‌ను మరోసారి ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల, వరద కాల్వ ప్రాంతాల్లో, చిన్ననీటి పారుదల శాఖ స్థలాల్లో మొక్కలు పెద్ద ఎత్తున నాటాలన్నారు.
     
    డీ గ్రేడెడ్‌ ఫారెస్టులో యూకలిప్టస్‌ మెుక్కలను విరివిగా పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఆర్‌ అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేసి రో డ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఖమ్మం జిల్లా లో మన సరిహద్దు నుంచి రోడ్డుకు ఇరువైపులా మెుక్కలు పెంచారని, మన జిల్లాలో కూడా అదే విధంగా రోడ్లకు ఇరువైపులా పెంచాలన్నారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనని సర్పంచ్‌లకు లేఖలు రాయాలని అధికారులకు సూచించారు. హరితహారంతో జిల్లాను పచ్చదనంతో నింపాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఇంటికి 5 పూలు, 5 పండ్ల మొక్కలు ఇవ్వాలన్నారు.
     
    ఈ నెల15 నాటికి ఎంచుకున్న లక్ష్యంలో 80 శాతం పూర్తి చే యాలన్నారు. కలెక్టర్‌ వాకాటి కరుణ మాట్లాడు తూ ఇప్పటి వరకు జిల్లాలో 2.11 కోట్ల మొక్కలు నాటామని.. 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. 142 ప్రదేశాల్లో 95 శాతం మొక్కలు బతికి ఉన్నాయని తెలిపారు. వచ్చే ఏడాది మొక్కల పెంపకానికి కూడా రెండు రోజుల్లో నర్సరీల వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమీక్షలో జెడ్పీ చైర్‌పర్సన్‌ జి. పద్మ, గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు రాజయ్య, కొండా సురేఖ, శంకర్‌నాయ క్, మునిసిపల్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, జేసీ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ, మం డల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు