‘టీబీజీకేఎస్‌ ఓ దొంగల బండి’

11 Sep, 2016 19:29 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వైవీరావు
  • ఏఐటీయూసీ నేత వైవీ.రావు
  • ౖయెటింక్లయిన్‌కాలనీ : కార్మికుల సొమ్ముతిని జైలుకెళ్లొచ్చిన నాయకులను అందలమెక్కిస్తూ టీబీజీకేఎస్‌ ఓ దొంగల బండిలా మారిందని  ఏఐటీయూసీ ఆర్జీ–3 కార్యదర్శి వైవీ.రావు విమర్శించారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆదివారం మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని గుర్తింపు యూనియన్‌గా గెలుపొందిన టీబీజీకేఎస్‌ నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు. కార్మికులను మరోసారి మోసం చేసేందుకే ఆ యూనియన్‌ నాయకులు గనులపైకి వస్తున్నారని అన్నారు. కార్మికులు టీబీజీకేఎస్‌ నాయకులను నిలదీయాలన్నారు. కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే కార్మికసంఘాలన్నీ ఒకేవేదికపైకి వచ్చి వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె నోటీస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఎస్‌ ఈవిషయంలో ముందుకు రావాలన్నారు. జైలుకువెళ్లి వచ్చిన చరిత్ర టీబీజీకేఎస్‌ నాయకులకు ఉందన్నారు. త్వరలో అందరూ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. వారసత్వ ఉద్యోగాలపై సమ్మె చేస్తే తాము మద్దతు ఇవ్వడానికి సిద్దమన్నారు. సమావేశంలో నాయకులు జూపాక రాంచందర్, కందికట్ల సమ్మయ్య, నాసర్‌అహ్మద్, గుండేటి తిరుపతి, మోహన్‌రావు, జగదీశ్, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.   
మరిన్ని వార్తలు