టీడీపీ గుర్తింపును రద్దు చేయాలి

17 Aug, 2016 18:39 IST|Sakshi

-  ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల
బంజారాహిల్స్(హైదరాబాద్‌సిటీ)

ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించిన తెలుగుదేశంపార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదుచేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబరు 1లోని తానిషా హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు చంద్రగిరి వెంకటేశ్వరరావు, కామాచార్యులు, కార్యదర్శులు తురక లవకుమార్, కిషోర్, రంగస్వామితో కలిసి మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూసి ఆకర్షితులైన ఓటర్లు ఓట్లు వేశారని అధికారంలోకి వచ్చాక ఆపార్టీ వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసగించిందని ఆరోపించారు. ఏపీలోని రైతులందరికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తారని, నిరుద్యోగులకు రూ 2000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నారని, బీసీ కులాల కోసం వంద హామీలు ఇచ్చారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. ఆపార్టీ గుర్తింపును రద్దు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు