నారా వారి బోగస్‌ బాగోతం

3 Apr, 2017 00:16 IST|Sakshi
 
వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి కుటుంబ సభ్యులకు టీడీపీ సభ్యత్వ కార్డులు
తప్పుడు సభ్యత్వాలతో భారీ ప్రచారం 
తోట సుబ్బారావునాయుడు విమర్శ
 
సామర్లకోట :
ఇతర పార్టీల కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులు జారీ చేస్తున్న బాగోతం రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అటువంటి బోగస్‌ బాగోతం సామర్లకోటలోనూ బయటపడింది. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి మేకా శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు జారీ చేశారు. ఈ వివరాలను వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు ఆదివారం విలేకర్లకు తెలిపారు. దేశంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో సభ్యత్వాలు ఇస్తున్నామంటూ భారీ ప్రచారం చేసుకుంటున్న టీడీపీ నేతలు అనేకమందికి బోగస్‌ సభ్యత్వాలు ఇచ్చారని అన్నారు. ఈమాత్రందానికే కోట్లాది సభ్యత్వాలు కలిగిన పార్టీగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోనే గుర్తింపు పొంది న నాయకులకు, విలేకర్లకు సహితం టీడీపీ సభ్యత్వాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా శ్రీను, చక్ర అచ్చివేణి దంపతులకు, శ్రీను తల్లి మంగయ్యమ్మలకు టీడీపీ సభ్యత్వ కార్డులు రావడం నారావారి సభ్యత్వ మాయలో భాగమేనని సుబ్బారావునాయుడు అన్నారు. సభ్యత్వా ల సంఖ్యను పెంచి చూపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీల వారి పేర్లు నమోదు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులే సభ్యత్వ సొమ్ములు చెల్లించి సభ్యత్వ కార్డులు జారీ చేస్తున్నారన్న విషయం దీనినిబట్టి స్పష్టమవుతోందన్నారు. పరిపాలనలోనే కాకుండా సభ్యత్వాల నమోదులో కూడా టీడీపీ విఫలమైందనడానికి ఇతర పార్టీ నేతలకు జారీ చేసి సభ్యత్వ కార్డులే నిదర్శనమని అన్నారు. మేకా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఐదేళ్లుగా తాను వైఎస్సార్‌ సీపీలో ఉంటున్నానని, అటువంటి తనకు టీడీపీ సభ్యత్వ కార్డులు రావడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. దీనినిబట్టి టీడీపీలో అనేకమందికి బోగస్‌ సభ్యత్వాలున్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీరాఘవరా వు, కౌన్సిలర్లు కాళ్ల లక్ష్మీనారాయణ, పితాని సూర్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొబ్బరాడ సత్తిబాబు, మాజీ కౌన్సిలర్లు కరణం కామేశ్వరరావు, గంగిరెడ్డి కృష్ణమూర్తి, చిట్టూరి లక్ష్మణరావు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు